అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్ట్
పమిడిముక్కల: రాత్రి సమయంలో ఇళ్లల్లో, దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడి ఆటలకు పమిడిముక్కల పోలీసులు చెక్ పెట్టారు. నిందితుడి నుంచి రూ.3.10 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గుడివాడ సబ్ డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, మిలిటరీ మాధవరం గ్రామానికి చెందిన కడియాల శ్రీధర్ రైళ్లలో, రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. ఏడాది కాలంగా అంతర్ జిల్లాల్లో బైక్ దొంగతనాలు, దేవాలయాలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో అతనిపై జీఆర్పీ విజయవాడలో 13 కేసులు ఉన్నాయి. సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీను సిబ్బందితో కలిసి మంగళవారం తాడంకి హైస్కూల్ వద్ద బైక్‌పై వెళ్తున్న నేరస్తుడు కడియాల శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. పమిడిముక్కల మండలం మంటాడ శివాలయంలో, కంకిపాడులో, తిరుపతిలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి రూ.2 లక్షల విలువైన 20 గ్రాముల బంగారం, లక్ష రూపాయలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.10,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బాలల హక్కుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ప్రతి ఒక్కరూ బాలల హక్కుల కోసం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్‌టీఏ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్ అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ కాలనీలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సెంటర్ కోఆర్డినేటర్ భలే సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టీవెన్ మాట్లాడుతూ బాలలకు ఆట, పాట, విద్యా, పౌష్టిక ఆహారం, ఆరోగ్యం, సంరక్షణ, వంటి హక్కు, రాజ్యాంగం కల్పించిందని వివరించారు. ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్ల యాంజిలో, ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ వీజీఎంవీఆర్ కృష్ణారావు ప్రభుత్వ ఉపాధ్యాయుని కిరణ్ కుమారి మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు భుజించాలని, స్వచ్ఛమైన నీరు తాగాలని, అనారోగ్యాలు పాలవకుండా తమను తాము రక్షించుకోవాలని సూచించారు. పోటీల్లో గెలుపొందిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు.
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్ట్


