తాగునీటితోనే జ్వరాలు
గ్రామంలో తాగునీటి సమస్య కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారు. అధికారులు చెబుతున్నదాని కంటే జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది. జ్వరాల సర్వే చేసి ప్రజలంతా పూర్తిగా కోలుకునే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలి.
– నిమ్మల కేశవకుమార్, ఎంపీటీసీ, ఉప్పులూరు
ఇటీవల కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేస్తే నీరు నిలవ ఉండేది కాదు. మురుగు నీరు నిలువ ఉండడం వలన దోమలు విజృంభించి ఉప్పులూరు ప్రజలు జ్వరాల బారిన పడ్డారు.
– డాక్టర్ బెన్నీసామ్యూల్, ప్రభుత్వ వైద్యాధికారి, యండగండి పీహెచ్‌సీ
ఉప్పులూరులో పారిశుద్ధ్య పనులు చేపట్టాం. గతంలో కురిసిన వర్షాల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం ఫాగ్ మిషన్ ద్వారా దోమల మందు చల్లిస్తున్నాం. గ్రామమంతా బ్లీచింగ్ చల్లించి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ప్రస్తుతం ప్రజల ఆరోగ్య పరిస్థితి కంట్రోల్‌లోనే ఉంది. – కే శ్రీనివాస్, ఎంపీడీవో, ఉండి
తాగునీటితోనే జ్వరాలు
తాగునీటితోనే జ్వరాలు


