బలివేలో ప్రత్యేక పూజలు
ముసునూరు: మండలంలోని శివాలయాలు నాలుగో సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున అమృత ఘడియల్లో బలివేలోని బలే రామస్వామి ఆలయంలో త్రిలోచనుడికి శివభక్తులు జ్యోతిర్లింగాక్షక పారాయణంతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. నూజివీడు సివిల్ కోర్టు జడ్జి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని, అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ముసునూరు,లింగపాలెం, పెదవేగి, ఏలూరు మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ పామర్తి సీతారామయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. చెక్కపల్లిలోని శివాలయం, భక్తాంజనేయ స్వామి ఆలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. రమణక్కపేటలోని పార్వతీ సమేత శివాలయంలో భక్తులు దీపోత్సవాన్ని నిర్వహించారు. వేల్పుచర్ల, గుడిపాడు, చింతలవల్లి, గోగులంపాడు, గ్రామాల్లోని శివాలయాలలో పలువురు భక్తులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.


