గోమాంసం కేరాఫ్‌ తణుకు? | - | Sakshi
Sakshi News home page

గోమాంసం కేరాఫ్‌ తణుకు?

Nov 17 2025 10:07 AM | Updated on Nov 17 2025 10:07 AM

గోమాం

గోమాంసం కేరాఫ్‌ తణుకు?

కుమ్మకై ్క కేసులు పెడుతున్నారు

ఎన్నో ఆశలతో ఇళ్లు కట్టుకున్నాం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: విశాఖలో వెలుగుచూసిన గోమాంసం లింకు తణుకు ప్రాంతంతో ముడిపడడం సంచలనంగా మారింది. విశాఖపట్నం పోర్టులో ఇటీవల కోల్డ్‌ స్టోరేజ్‌లో నిఘా విభాగం పట్టుకున్న 1.89 లక్షల కిలోల గోమాంసంతో ఈ ప్రాంతానికి సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలతో తణుకు వాసులు ఆందోళన చెందుతున్నారు. విశాఖలో కంటైనర్లు, కోల్ట్‌ స్టోరేజ్‌లలో పట్టుబడిన గోమాంసంలో ఎక్కువ భాగం తణుకుదేనని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పశు సంవర్థక శాఖ తాడేపల్లిగూడెం డీడీ డాక్టర్‌ సుధాకర్‌ను విశాఖకు రప్పించి కేంద్ర నిఘా విభాగం వివరాలు ఆరాతీసింది. గోవధ మహా పాపమని, తణుకులాంటి ప్రాంతంలో ఇలా జరుగుతుందా? అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న లాహం ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో నిర్వహిస్తున్న పశువధ కారణంగా ఇటీవల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశు వధ కార్యకలాపాలతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని పిల్లలకు ఊపిరి అందడంలేదని కర్మాగారం ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిటికీలు, తలుపులు తెరచుకునే అదృష్టం లేకుండాపోయిందని, తలుపులు తెరిస్తే చాలు దుర్వాసనతో అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. పిల్లలు ఆరుబయట ఆటలాడుకునేందుకు ఇంటి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. కోవిడ్‌ పరిస్థితుల్లో ఉపయోగించిన మాస్క్‌లు తేతలి గ్రామ పరిధిలోని మహాలక్ష్మీనగర్‌లో ఇప్పటికీ వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుబయట కూర్చోవాలంటే మహిళలు మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని వాపోతున్నారు.

నాలుగు జిల్లాల నుంచి పశువుల తరలింపు

తేతలి పశువధ కర్మాగారానికి తణుకు పరిసర ప్రాంతాల్లోని పశువులతోపాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి పశువులను అక్రమ మార్గంలో వ్యాన్‌లపై తోలుకువస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఏ ప్రాంతంలో గేదెలు కనిపించకపోయినా తేతలి పశువధ కర్మాగారానికి వచ్చి వెతుక్కునే పరిస్థితి వచ్చిందంటూ పశు పోషకులు చెబుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో పశువులను పశువధ శాలకు తోలుకు వస్తున్నారని, పశువులను నిబంధనలకు విరుద్దంగా ఒకదానిపై ఒకటి ఎక్కించి తీసుకొస్తున్నారని, అవి తీవ్రంగా గాయపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు తేతలి ప్రాంతానికే పరిమితమైన పశువధశాలకు చెందిన దుర్వాసన నేడు మెల్లగా తణుకు ప్రాంతానికి కూడా పాకింది. తాజాగా తణుకులోని సజ్జాపురం, పైడిపర్రు ప్రాంతాలకు కూడా దుర్వాసన వెదజల్లుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. తేతలి గ్రామంతోపాటు డ్రైవర్స్‌ కాలనీ, పైడిపర్రు, మహలక్ష్మీనగర్‌, సజ్జాపురం, అండర్‌ గ్రౌండ్‌ ప్రాంతవాసులు ఈ దుర్వాసనకు బాధితులుగా ఉన్నారు.

విశాఖలో పట్టుబడ్డ గోమాంసం లింకులపై కథనాలు

తణుకులో గోవధ జరుగుతోందా?

పశువధ శాల ప్రాంతంలో ఉండలేకపోతున్నామంటున్న బాధితులు

ఎదురుతిరిగితే దాడులు, కేసులు

తణుకు ఎమ్మెల్యే న్యాయం చేయలేదంటున్న బాధితులు

పశువులను వధించడం వల్ల స్థానికంగా బతకడం కష్టంగా ఉంది. బాధితులందరం కలిసి రోడ్డెక్కితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైతం పశువధశాలకే అనుకూలంగా ఉంటున్నారు. పోలీసులు, పశువధశాల యజమానులు కుమ్మకై ్క పోయి పోరాటం చేసే మాపైనే కేసులు పెట్టే పరిస్థితి ఎదురైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం ఈ ప్రాంతం బీడుగా మారే ప్రమాదం ఉంది. –రాపాక మందులు, మహాలక్ష్మీనగర్‌, తేతలి

కష్టార్జితంతోపాటు అప్పులు చేసి తేతలిలోని మహాలక్ష్మినగర్‌లో ఇళ్లు నిర్మించుకున్నాం. ఏడాది కాలంగా విపరీతమైన దుర్వాసనతో పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు. ఆ వాసన సమయంలో కడుపులో తిప్పడంతోపాటు తల తిరిగిపోతుంది. తణుకు ఎమ్మెల్యేతోపాటు జిల్లా కలెక్టరు, పవన్‌ కల్యాణ్‌ను కూడా కలిశాం. మా సమస్య పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కారం కాకపోతే ఇళ్లు వదిలిపెట్టి దూరంగా వెళ్లాల్సిందే. –టి.భవాని, మహాలక్ష్మీనగర్‌, తేతలి

గోమాంసం కేరాఫ్‌ తణుకు?1
1/3

గోమాంసం కేరాఫ్‌ తణుకు?

గోమాంసం కేరాఫ్‌ తణుకు?2
2/3

గోమాంసం కేరాఫ్‌ తణుకు?

గోమాంసం కేరాఫ్‌ తణుకు?3
3/3

గోమాంసం కేరాఫ్‌ తణుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement