భయం భయంగా..
భీమడోలు మీదుగా ద్వారకాతిరుమల క్షేత్రానికి కాలినడకన వెళ్తున్నాను. మధ్యలోని గ్రామాల్లో ఉన్న సెంటర్లలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో వీధి లైట్లు లేవు. నడిచి వెళుతుంటే వాహనాలు మీదకొస్తున్నాయి. దాంతో భయం భయంగా నడవాల్సి వస్తోంది. కనీసం లైట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– కిలాడి కొండమ్మ, వసంతవాడ, పెదపాడు మండలం
దూబచర్ల నుంచి రాళ్లకుంట మీదుగా క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నాను. మధ్యలో రోడ్డుపైనే పాములు కనిపించాయి. కనీసం వీధి లైట్లు కూడా లేవు. విద్యుత్ స్తంభాలకు మాత్రం ఇనుప పైపులు దర్శనమిస్తున్నాయ్. లైట్లు ఏర్పాటు చేయనప్పుడు ఆ పైపులెందుకు. వెంటనే నడక దారిలో లైట్లు ఏర్పాటు చేయాలి
–దొడ్డ రాధాకృష్ణ, చానమిల్లి, పెదపాడు మండలం
కాలినడక మార్గాల్లో షెల్టర్లు లేక ఇబ్బందిగా ఉంది. నడవలేని వారు విశ్రాంతి పొందే వీలు లేక రోడ్ల పక్కనే కూర్చుంటున్నారు. ప్రతి మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒకటైనా షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా ఇంతవరకూ పట్టించుకోకపోవడం సరికాదు. ఇప్పటికైనా దేవస్థానం సిబ్బంది, ప్రభుత్వం దృష్టి సారించాలి.
అధికారి బాబీ, మార్టేరు
దూబచర్ల–ద్వారకాతిరుమల కాలినడక మార్గంలో మరుగుదొడ్లు లేవు. దాంతో పాదయాత్రగా వస్తున్న భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా మహిళా భక్తులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. దానికి తోడు రోడ్ల పక్కన పెరిగిన పొదలు, లైట్లు లేని చీకటి మార్గం వల్ల నరకం కనిపించింది.
– బత్తుల శివలక్ష్మి, కుంచనపల్లి, తాడేపల్లిగూడెం మండలం
భయం భయంగా..
భయం భయంగా..
భయం భయంగా..


