‘సంతాన ప్రాప్తిరస్తు’ టీం సందడి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల విడుదలైన సంతాన ప్రాప్తిరస్తు చిత్రం తారాగణం ఆదివారం నగరంలో సందడి చేసింది. హీరో, హీరోయిన్లు విక్రాంత్, చాందినీ చౌదరి చిత్రం ప్రదర్శితమౌతున్న వీ– మ్యాక్స్ థియేటర్‌లో ప్రేక్షకులతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ యువ జంటలు ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్యను ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కించామన్నారు. హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, ప్రేక్షకులు మంచి చిత్రం చూసామనే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. హీరో, హీరోయిన్లు పడమర వీధిలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి మేడల్లో కొలువై ఉన్న అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బుట్టాయగూడెం: బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడ్రన్ స్కూల్ విద్యార్థిని తెల్లం భువన ప్రథమ స్థానంలో నిలిచిందని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ తెలిపారు. బహుమతిని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు.
‘సంతాన ప్రాప్తిరస్తు’ టీం సందడి


