ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ | - | Sakshi
Sakshi News home page

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ

Nov 17 2025 7:17 AM | Updated on Nov 17 2025 7:17 AM

ఊరిస్

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ

ప్రచార ఆర్భాటంగా స్వచ్ఛాంధ్ర

గోమాంసం కేరాఫ్‌ తణుకు?

8లో

న్యూస్‌రీల్‌

సాయం ఏది సారూ ?

రుణం మంజూరు కాలేదు

అంతా మోసమే..

ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం పాలనలోనూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. పేదల కోసం కొత్త కార్యక్రమాలు చేస్తున్నట్టు హడావుడి చేయడం, లబ్ధిదారుల ఎంపికంటూ అధికారులను పరుగులు పెట్టించడం, పేదల్లో ఆశలు రేకెత్తించి చివరకు అటకెక్కించడం పరిపాటిగా మారింది. కార్పొరేషన్‌ రుణాల పేరిట సోపానం, పేదవర్గాల కోసం చేపట్టిన పీ–4 ఇలా కార్యక్రమం ఏదైనా చివరకు జరుగుతోంది ఇదేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల్లోని నిరుద్యోగ యువత స్వయం ఉపాదికి సబ్సిడీ రుణాల పేరిట చంద్రబాబు ప్రభుత్వం మార్చిలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. జిల్లాకు రూ.122.5 కోట్ల విలువైన 3,728 యూనిట్లను కేటాయించింది. వీటిని రూ.2 లక్షలు, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల కేటగిరీలుగా విభజించింది. జనరిక్‌ మెడికల్‌ షాపుల యూనిట్‌ ధర రూ.8 లక్షలుగా ఉంది. యూనిట్‌ వ్యయం మొత్తంలో 40 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ, మిగిలింది బ్యాంకు రుణంగా నిర్ణయించింది. తొలుత మార్చి నెలాఖరు నాటికి యూనిట్లను గ్రౌండ్‌ చేయాలని భావించగా ఎమ్మెల్నీ ఎన్నికల కోడ్‌ రావడంతో మే నెలాఖరు వరకు పొడిగించింది. ‘స్వయం ఉపాధి సోపానం’ పేరిట లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వూలు సైతం నిర్వహించగా ఇప్పుడు ఆ ఊసే వినిపించడం లేదు. ఒక్కో గ్రామానికి కేటాయించిన యూనిట్లు ఐదు నుంచి పదిలోపే ఉండగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. రుణాలు రాని వారి అసంతృప్తి ప్రభుత్వానికి చేటు చేస్తుందన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు వెనుకడుగేశారని తెలుస్తోంది. తమకు కార్పొరేషన్‌ రుణాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని ఇంటర్వూల్లో ఎంపికై న అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

విశాఖలోని పోర్టులో వెలుగుచూసిన గోమాంసం లింకు తణుకు ప్రాంతంతో ముడిపడటం సంచలనంగా మారింది.

అట్టడుగు పేద కుటుంబాలను సంపన్నుల సాయంతో అభివద్ధి చేసేందుకు పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌ పార్టనర్‌షిప్‌ (పీ–4) అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో మొత్తం 4,92,292 కుటుంబాలకు పలు వడపోతల తర్వాత 64,940 కుటుంబాలు అర్హులుగా ఎంపిక చేశారు. సంపన్నులను మార్గదర్శకులుగా చేర్పించి ఆయా కుటుంబాలను వారికి అనుసంధానించాలి. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత, లేదా జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నది పీ–4 ముఖ్య ఉద్దేశం. జిల్లాలో 15 వేల మంది మార్గదర్శకులను గుర్తించాలని లక్ష్యం కాగా సుమారు 1,700 మంది మాత్రమే మార్గదర్శకులు రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరికి దాదాపు 35 వేల కుటుంబాలను మ్యాపింగ్‌ చేశారు. మార్గదర్శకులుగా చేరేందుకు సంపన్న వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో చివరకు ఉద్యోగవర్గాలపై భారం మోపారు. టీచర్లను భాగస్వాములను చేసే ప్రయత్నాలను ఉపాధ్యాయ సంఘాలు ఆదిలోనే తిప్పికొట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని పేద కుటుంబాలకు ఏ విధంగా మేలు జరిగిందనేది స్పష్టత లేదు. ప్రస్తుతం పీ–4 అమలులోనే ఉన్నట్టు చెబుతున్నా గతంలో మాదిరి రోజువారీ రివ్యూలు, ప్రగతి నివేదికలు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

కొబ్బరి వ్యాపారం కోసం కాపు కార్పొరేషన్‌ ద్వారా రుణం వస్తుందని ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇంతవరకూ రుణం మంజూరు కాలేదు. ఈ ఏడాది కొబ్బరి ధర బాగుండడంతో తోటి వ్యాపారస్తులంతా పెద్ద సంఖ్యలో లాభాలు ఆర్జించారు. పెట్టుబడి సాయం లేకపోవడంతో నేను నష్టపోయాను.

– వల్లభు దుర్గాప్రసాద్‌, యలమంచిలిలంక

చంద్రబాబు సర్కార్‌ మాయ మాటలతో పాలన సాగిస్తోంది. కార్పొరేషన్‌ రుణాలు, పీ–4, గృహ నిర్మాణానికి రూ.4 లక్ష సాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం వాటిని పక్కన పడేసి పేదలను అవమానపరిచింది. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న, ప్రజలకు ఏదైనా చేయాలన్న జగన్‌మోహన్‌రెడ్డి తర్వాతే ఎవరైనా.

– పీవీఆర్‌కే ఆంజనేయరాజు, ఎంపీటీసీ, వాండ్రం

సోపానం.. సుదూరం

జాడలేని కార్పొరేషన్‌ రుణాలు

దారిచూపని పీ–4 సాయం

జిల్లాలో 64,940 కుటుంబాల ఎదురుచూపులు

పారిశుద్ధ్యంపై తనిఖీల్లేవు

ఏడాదిన్నరలో అటకెక్కిన హామీలెన్నో..

ప్రచార ఆర్భాటంగా చంద్రబాబు సర్కారు పాలన

అక్టోబర్‌ 2 తర్వాత నుంచి రాష్ట్రం అంతటా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు మార్చిలో తణుకులో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎక్కడకు వచ్చేది రెండు, మూడు గంటల ముందే తెలియజేస్తానని, ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుందన్నారు. స్వచ్ఛత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కచోట కూడా ఆకస్మిక తనిఖీలు చేసింది లేదు. అందుకోసం ప్రణాళికలు రచించింది లేదు. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో స్వచ్ఛాంధ్ర ప్రకటనలకే పరిమితమవుతోంది. చాలా పంచాయతీల్లో సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. డంపింగ్‌ యార్డులు లేక, బృందావనాలు వినియోగానికి నోచుకోక గ్రా మాల్లో సేకరించిన చెత్తను కాలువ గట్లు, రోడ్లు పక్కన ఎక్కడపడితే అక్కడే డంప్‌ చేస్తున్నారు.

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ 1
1/4

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ 2
2/4

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ 3
3/4

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ 4
4/4

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement