●అంతటా నిర్లక్ష్యం.. అందేంత ఎత్తులో ప్రమాదం
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలు తెచ్చిపెట్టేలా ఉంది. తణుకు బొమ్మల వీధిలో డ్రెయినేజీలో కలిసిన విద్యుత్ స్తంభం తుప్పుపట్టి కూలేందుకు సిద్ధంగా ఉంది. అలాగే ఇదే వీధిని ఆనుకుని ఉన్న నంబర్ 13 లాల్ బహుదూర్ శాస్త్రి మున్సిపల్ పాఠశాల రోడ్డులో ఫ్యూజు క్యారియర్ బాక్సు చేతికి అందేంత ఎత్తులో ఉంది. విద్యుత్ తీగలు కూడా తక్కువ ఎత్తులో ఉన్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారని, ఆయా సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
– తణుకు అర్బన్
●అంతటా నిర్లక్ష్యం.. అందేంత ఎత్తులో ప్రమాదం


