వచ్చేనెలలో బాలోత్సవం | - | Sakshi
Sakshi News home page

వచ్చేనెలలో బాలోత్సవం

Nov 15 2025 7:53 AM | Updated on Nov 15 2025 7:53 AM

వచ్చే

వచ్చేనెలలో బాలోత్సవం

వచ్చేనెలలో బాలోత్సవం రిజిస్ట్రేషన్‌ అధికారుల సస్పెన్షన్‌ నేడు పరిశుభ్రత కార్యక్రమాలు భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. జిల్లా అంతటా విస్తృతంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. అలాగే ఈనెల 19న ప్రపంచ టాయిలెట్‌ దినోత్సవం సందర్భంగా సురక్షితమైన పారిశుద్ధ్యం, టాయిలెట్‌ వినియోగం, పరిశుభ్రత ప్రాముఖ్యతపై సామూహిక అవగాహన ప్రచారాలు, పోటీలను నిర్వహించాలని సూచించారు. ఆర్డీఓలు దాసి రాజు, ఖతీబ్‌ కౌసర్‌ భానో, సీపీఓ కె.శ్రీనివాసరావు, డీపీఓ ఎం.రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతి

భీమవరం: భీమవరంలో మూడేళ్లుగా బాలో త్సవం నిర్వహణ పిల్లల్లో శాసీ్త్రయ దృక్పథం, అభ్యుదయ భావజాలం, సృజనాత్మకతను పెంపొందించి సమాజాబివృద్ధికి దోహదం చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి అన్నారు. శుక్రవారం బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత బాలోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. బాలో త్సవాలు వచ్చేనెల 12, 13 తేదీల్లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. ప్రసాదరాజు మాట్లాడుతూ 18 కల్చరల్‌, 15 అకడమిక్‌ అంశాల్లో బాలోత్సవం నిర్వహిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ పట్టాభిరామయ్య, ఉపాధ్యక్షుడు గాతల జేమ్స్‌, ట్రెజరర్‌ పి.సీతారామరాజు, కల్చరల్‌ కమిటీ కన్వీనర్‌ బి.చైతన్య ప్రసాద్‌, అకడమిక్‌ కమిటీ కన్వీనర్‌ పి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

ఉండి: ఏనీవేర్‌ రిజిస్ట్రేషన్లకు చిరునామాగా మారిన ఉండి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఉండిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఎంవీ సుధారాణి, ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సరాబంధురాజును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. బదిలీపై కాకినాడ వెళ్లిన సుధారాణికి సమాచా రం అందించారు. ఉండిలో పనిచేస్తున్న సరాబంధు రాజు డ్యూటీకి వచ్చి తిరిగి వెళ్లిపోయారు. ఉండిలో ప్రత్యేక బృందంతో దర్యాప్తు అనంతరం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

భీమవరం: రైలులో గంజాయి తరలిస్తున్న ము గ్గురు వ్యక్తులు భీమవరంలో రైల్వే పోలీసులకు చిక్కారు. రైల్వే సీఐ సోమరాజు తెలిపిన వివరాల ప్రకారం ఒడిసాకు చెందిన మనుప్రధాన్‌, అరుణ్‌ప్రధాన్‌, డింకుడిగాల్‌ శుక్రవారం పూరి–తిరుపతి రైలులో ఒడిసా నుంచి విజయవాడకు 10 కిలో గంజాయిని నాలుగు బాక్సుల్లో ప్యాక్‌ చేసి తరలిస్తున్నారు. భీమవరం టౌన్‌ రైల్యే స్టేష న్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా ముగ్గురు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి అరెస్టు చేసినట్టు సోమరాజు తెలిపారు. గంజాయి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. ఈ దాడిలో ఎస్సై సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి: చించినాడ వద్ద వశిష్ట గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం శుక్రవారం గోదావరిలో రైలు వంతెన సమీపంలో లభ్యమైందని ఎస్సై కర్ణీడి గురుయ్య తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం మొగల్తూరు మండలం కుమ్మరపురుగుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు (35) చించినాడ వద్ద వశిష్ట గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. వంతెనపై అతడి బైక్‌, సెల్‌, పాదరక్షలు కనిపించడంతో స్థానికులు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేశారు. సుబ్బారావు సోదరుడు జల దుర్గారావు గురువారం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసి గోదావరిలో గాలించగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. అప్పటికే చీకటి పడటంతో మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. శవ పంచనామా, పోస్టుమార్టం శనివారం నిర్వహిస్తామని ఎస్సై గుర్రయ్య చెప్పారు.

వచ్చేనెలలో బాలోత్సవం 1
1/1

వచ్చేనెలలో బాలోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement