టెన్నిస్ పోటీల నిర్వహణ భేష్
జ్యోతిర్లింగార్చన
భీమవరం (ప్రకాశంచౌక్): పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. జ్యోతిర్లింగార్చన నేత్రపర్వమైంది.
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కాస్మోకల్చరల్ స్పో ర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న సీహెచ్ బుద్దావతా రం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు శుక్రవారంతో ముగి శాయి. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఏటా టెన్నిస్ పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విజేతల కు బహుమతులు అందించారు. పోటీల్లో వివిధ రా ష్ట్రాల నుంచి 230 మంది క్రీడాకారులు హాజరయ్యా రు. కాంప్లెక్స్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బూన్‌రాజు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
● 75 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్‌గా రాధాకృష్ణ (చైన్నె), నాయుడు (అనకాపల్లి)
● 70 ఏళ్ల విభాగంలో.. ఎస్.సెట్టు (తమిళనాడు), ఎ.రాంబాబు (తెలంగాణ), సింగిల్స్‌లో ఎస్.సెట్టు (తమిళనాడు)
● 65 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్‌గా వి.శ్రీనివాసరెడ్డి (అనంతపురం) ఎస్.రాథ్ (ఒడిసా), సింగిల్స్‌లో శ్రీనివాసరెడ్డి (అనంతపురం)
● 55 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్‌గా ఆర్‌ఎన్ రమేష్ (మైసూర్), పాల్ మనోహర్ (తెలంగాణ), సింగిల్స్‌లో ఆర్‌ఎన్ రమేష్ (మైసూర్)
● 45 ఏళ్ల విభాగంలో.. డబుల్స్ విన్నర్స్‌గా ఎంవీఎల్‌ఎన్ రాజు (విశాఖ), దినకర్‌రెడ్డి (తిరుపతి), సింగిల్స్‌లో నాగరాజ్ (హిందూపురం).


