రైల్వేగేటును ఢీకొన్న వాహనం
● నిలిచిన విద్యుత్ సరఫరా
● రైళ్ల రాకపోకలకు ఆటంకం
అత్తిలి: అత్తిలి మండలంలోని మంచిలి రైల్వేగేటును బొలెరో వాహనం ఢీకొట్టడంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మార్టేరు నుంచి అత్తిలి వైపు వస్తున్న బొలెరో వాహనం మంచిలి రైల్వేస్టేషన్ వద్దకు వచ్చేసరికి రైల్వేగేటు వేసి ఉంది. అయితే డ్రైవర్ గుర్తించకుండా బొలెరో వాహనాన్ని వేగంగా తీసుకువచ్చి రైల్వేగేటును ఢీకొట్టాడు. దీంతో గేటు పోల్‌పైకి లేచి రైల్వే విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ తీగలు కిందకు వేలాడాయి. ఈ మార్గంలో వచ్చే రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయి. రైల్వేశాఖ అఽధికారులు తక్షణమే విద్యుత్ తీగలకు మరమ్మతులు చేపట్టడంతో రాత్రి 7.50 గంటలకు రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించాయి. విద్యుత్ తీగల మరమ్మతుల కా రణంగా రైల్వేగేటుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. బొలేరో వాహనం డ్రైవర్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


