వ్యవస్థల నిర్వీర్యం చంద్రబాబు నైజం
పాలకోడేరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ న రసింహరాజు అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం చంద్రబాబు నైజమన్నారు. శుక్రవారం వి స్సాకోడేరు, గొగరనమూడి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేటుపరం చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసిందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం చేపట్టగా అపూర్వ స్పంద వస్తోందన్నారు. ప్రైవేటీకరణను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనంతరం నా యకులతో కలిసి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. విస్సాకోడేరు సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు చేకూరి నరేంద్రరాజు, విస్సాకోడేరు మాజీ సర్పంచ్ పెన్మత్స శ్రీనివాసరాజు, పంపన రామకృష్ణ, దొంగ సురేష్, బళ్ల పరమేశ్వరరావు, దిడ్ల ప్రవీణ్, తులసే చంద్రమోహన్, ఎంపీటీసీ బొల్లం గాంధీ, నాయకులు పాల్గొన్నారు.


