సర్కారు గూడుపుఠాణి | - | Sakshi
Sakshi News home page

సర్కారు గూడుపుఠాణి

Nov 14 2025 8:59 AM | Updated on Nov 14 2025 8:59 AM

సర్కా

సర్కారు గూడుపుఠాణి

న్యూస్‌రీల్‌

క్రెడిట్‌ చోరీ ప్రభుత్వమిది

పేదల స్థలాలకు ఎసరు !

తామే నిర్మించినట్టుగా గొప్పలు

మా ప్రభుత్వం రావడమే ఆలస్యం.. ఇళ్లు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇస్తామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు ఊరూవాడా ఊదరగొట్టారు. పాలన చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. కొత్తగా గృహ నిర్మాణ సాయం చేసిందీ లేదు. కాగా గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లను గృహప్రవేశాల పేరిట తామే నిర్మించామంటూ చంద్రబాబు సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది.

శురకవారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా గత వై ఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని 626 లేఅవుట్లలో దాదాపు 47,362 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సొంత స్థలం ఉన్న వారితో కలిపి 56,210 మందికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షల చొప్పున సాయం మంజూరు చేశారు. గృహనిర్మాణ పనుల వేగవంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్‌ తదితర సదుపాయాలు కల్పనకు కృషి చేశారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35 వేల రుణ సాయాన్ని అందించారు. సబ్సిడీపై ఐరన్‌, సిమెంట్‌, ఇసుకను ఉచితంగా అందజేయడంతో పాటు పేదలపై రవాణా భారం పడకుండా లేఅవుట్ల సమీపంలోనే స్టాక్‌ పాయింట్లను ఏర్పాటుచేశారు. పదేళ్ల తర్వాత ఇంటిపై సర్వహక్కులు ఉండేలా అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించి లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2024 మే నెలాఖరు నాటికి జిల్లాలో 30,947 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వాటిలో కొన్ని పునాది, రూఫ్‌ తదితర దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి.

రూ.4 లక్షలు సాయమని చెప్పి..

రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎం ఆవాస్‌ యోజనతో అనుసంధానం చేసి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయం చేయనున్నట్టు చంద్రబాబు సర్కారు ప్రకటించింది. కొత్తగా మంజూరు చేసే ఇళ్లకు మాత్రమే ఈ సాయం అందిస్తామంది. 2025 మార్చి నుంచి గృహనిర్మాణ సాయం మంజూరు చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పుడూ ఆ ఊసే ఎత్తడం లేదు.

ఏడాది లక్ష్యాన్ని చేరలేక..

గత ప్రభుత్వంలో పునాది, లింటల్‌ తదితర దశ ల్లోని 9,107 ఇళ్లను ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పూర్తిచేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. రూ.1.80 లక్షలకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు సాయాన్ని ప్రకటించింది. కాగా సిమెంట్‌, ఐరన్‌, ఇటుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో ఈ సాయం చాలక లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి. నిర్ణీత గడువు నాటికి కేవలం 3,434 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు.

పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం గత ప్రభు త్వం తెచ్చిన పథకాలు, పనులను తమవిగా చెప్పుకుంటూ చంద్రబాబు సర్కారు క్రెడిట్‌ చోరీకి ప్రయత్నించడమే తప్ప ఏడాదిన్నర పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. ఇప్పటివరకూ సెంటు భూమి ఇవ్వని ఈ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు నిర్మించినట్టు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలుచేయలేక చేతులెత్తేసి చంద్రబాబు సర్కారు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారు.

– కారుమూరి వెంకట నాగేశ్వరరావు

మాజీ మంత్రి, తణుకు

బాబు ‘కలరింగ్‌’

ఏడాదిన్నరలో సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం

జిల్లాలో ఇళ్లు నిర్మించినట్టు కలరింగ్‌

గృహప్రవేశాల పేరిట హడావుడి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 56,210 ఇళ్లు మంజూరు

మే 2024 నాటికి 30,947 ఇళ్లు పూర్తి

సెంటు భూమి సేకరించి పేదలకు పంచిన దాఖలాలు లేని చంద్రబాబు సర్కారు ఇప్పుడు పాత పంథానే అనుసరిస్తోంది. గతంలో స్థలాలు పొంది ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణం చేసుకోని వారి స్థలాలకు ఎసరుపెట్టే పనిలో ఉంది. ఇళ్లు కట్టుకోని వారి స్థలాలను రద్దు చేసి అర్హులైన వారికి అందజేయనున్నట్టు గతంలో జరిగిన కేబినేట్‌ సమావేశంలో నిర్ణయించింది. ఈ స్థలం ఉందన్న భరోసాతో వీరిలో పిల్లల పెళ్లిళ్లు చేసిన వారూ, వైద్యం కోసం అప్పులు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు.

ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద అర్బన్‌ ఏరియాలో స్థలాలు ఉన్న కేవలం 595 మందికి మాత్రమే గృహ నిర్మాణ సాయాన్ని మంజూరు చేశారు. వీటిలో తణుకులో 111, నరసాపురంలో 75, భీమవరంలో 85, పాలకొల్లులో 60, తాడేపల్లిగూడెంలో 149, ఆకివీడులో 115 మంది ఉన్నారు. గ్రామాల్లో ఇంకా సర్వే చేస్తున్నారు. కాగా పీఏంఏవై కింద గతంలో జిల్లాకు 6,770 గృహాలు మంజూరు కాగా ఇప్పటికే 6,600 ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు పూర్తిచేసుకున్నారు. మిగిలిన 100 ఇళ్ల నిర్మాణాల్లో తాజాగా గృహ ప్రవేశాలు నిర్వహించి మొత్తం ఇళ్లను తామే నిర్మించినట్టు చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం.

సర్కారు గూడుపుఠాణి 1
1/3

సర్కారు గూడుపుఠాణి

సర్కారు గూడుపుఠాణి 2
2/3

సర్కారు గూడుపుఠాణి

సర్కారు గూడుపుఠాణి 3
3/3

సర్కారు గూడుపుఠాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement