విద్యారంగంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యారంగంపై ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్ తదితర బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. యూ టీఎఫ్ మండల శాఖ నూతన కౌన్సిల్ సమావేశం గురువారం పట్టణంలోని జెడ్పీ హైస్కూల్‌లో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించారు. గోపిమూర్తి మాట్లాడుతూ విద్యా బోధనలో యాప్‌ల నిర్వహణను ఖండించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాజు, ప్రధాన కార్యదర్శి రామభద్ర, కోశాధికారి పి.క్రాంతికుమార్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కేవీ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి పి.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జిల్లాలో 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను శుక్రవారం నుంచి 20 వరకు నిర్వహించనున్న సందర్భంగా వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. వారోత్సవాల్లో భాగంగా సహకార రంగం ప్రాముఖ్యత, ప్రజాదరణ, కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత సాధకులుగా సహకార సంఘాలు పనిచేయాలన్నారు. సహకార సంఘాల నిర్వహణ సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించేందుకు కంప్యూటరీకరణ అమలు చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి కె.మురళీకృష్ణ, అసిస్టెంట్ రిజిస్టర్లు ఈ.పూర్ణచంద్రరావు, ఐ.హుస్సేన్, ఎస్.శ్రీనివాసరావు జి.సత్యనారాయణ, సీనియర్ ఇన్‌స్పెక్టర్ డి.శేషుబాబు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): రెండు రోజులుగా ఓ ప్రధాన పత్రిక పనిగట్టు కుని సచివాలయ ఉద్యోగులపై కక్షపూరితమైన వార్తలు రాయడం సరికాదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రీజినల్ కో–ఆర్డినేటర్ జీవీఎస్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవచేయాలనే ఆకాంక్షతో రాష్ట్రంలో 1.20 లక్షల మంది సచివాలయ వ్యవస్థలోకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారన్నా రు. గత 16 నెలలుగా ఆత్మగౌరవాన్ని సైతం పక్కనపెట్టి ఇంటింటా సర్వేలు చేస్తున్నా ఆ పత్రికకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. తమ సేవలను సీఎం అభినందిస్తుంటే, ప్రభుత్వానికి, సచివాలయ ఉద్యోగుల మధ్య ఎందుకు గ్యాప్ సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకువచ్చిందనే ఏకైక కారణంతోనే తమపై కక్ష కట్టడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులపై వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని ఆయన కోరారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు ఆర్‌ఆర్‌పేట వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి అర్చన నిమిత్తం 108 స్వర్ణ పుష్పాల తయారీకి విరాళాలు సేకరించిన అధికారులు, స్వర్ణ పుష్పాల తయారీ చేపట్టలేదని, చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. దేవదాయశాఖ రీజనల్ జా యింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు గురువారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. 2021లో 108 మంది భక్తులు 4 గ్రాముల చొప్పున బంగారం నిమిత్తం సొమ్ములు చెల్లించారన్నారు. ఆర్‌జేసీ ని కలిసిన వారిలో బీకేఎస్‌ఆర్ అయ్యంగార్, జీవీ నాగేశ్వరరావు, గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, నాగళ్ల శ్రీనివాసరావు ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించాల్సి ఎస్‌ఏ–1 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకూ జరగాల్సిన పరీక్షలను 17వ తేదీన, 6 నుంచి 10వ తరగతి వరకూ జరగాల్సిన పరీక్షలను 20న నిర్వహించాలని ఆదేశించా మ ని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను అప్పటివర కూ సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు.


