హాస్టల్ విద్యార్థులపై గేదె దాడి
భీమడోలు: భీమడోలు జెడ్పీ హైస్కూల్ నుంచి హాస్టల్‌కు వెళుతున్న విద్యార్థులపై ఓ గేదె దాడి చేయగా 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు విద్యార్థులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని భీమడోలు సీహెచ్‌సీలో వైద్యం అందించి హాస్టల్‌కు పంపారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భీమడోలు ఆస్పత్రికి చేరుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. భీమడోలు హైస్కూల్‌ను సాయంత్రం 4 గంటలకు విడిచిపెట్టడంతో పాఠశాలలో విద్యార్థులంతా రోడ్డుపై వెళుతున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ గేదె పరుగులు తీస్తూ భీమడోలు బాలురు, బాలికల వసతి గృహానికి చెందిన 6,8,9,10 తరగతులకు చెందిన 9 మంది విద్యార్థులపై దాడి చేసింది. విద్యార్థులు సీహెచ్ లక్ష్మీచోళిత, దేవదాసు విన్సీ, జంగం సన్నీ, బి.భార్గవికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్.దీప్తి, వై.ఏసుకుమారి, యూజే సింధు, బి.లావణ్య, బి.శైలజలకు స్వల్ప గాయాలయ్యాయి. వా రందరినీ భీమడోలు సీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. తీవ్ర గాయాలైన నలుగురిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎంఈఓ–2 అయినపర్తి భాస్కర్‌కుమార్‌లు పరామర్శించారు. మెరు గైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ధర్మరాజు కోరా రు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
విద్యార్థులను పరామర్శిస్తున్న డీఈఓ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు
హాస్టల్ విద్యార్థులపై గేదె దాడి
హాస్టల్ విద్యార్థులపై గేదె దాడి


