కొల్లేరు అభయారణ్యం హద్దులను గుర్తించాలి
మాంసాహారం.. డల్లుగా వ్యాపారం
కార్తీకమాసం కావడంతో 20 రోజులుగా మాంసాహార వినియోగం తగ్గింది. వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారులు అంటున్నారు. 8లో u
ఏలూరు(మెట్రో): కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో అటవీ శాఖ అదనపు ప్రి న్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అ టవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కొ ల్లేరు అభయారణ్యం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంపై నివేదిక కోరిన అంశాలపై చలపతిరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర స్తుతం ఉన్న రికార్డులను ఆధునిక లిడార్ సర్వే టె క్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. జిరాయితీ, డి.ఫారం పట్టా భూముల వివరాలతో పాటు కేంద్ర సాధికార కమిటీ ఆదేశించిన నివేదికలు సమర్పించాలన్నారు. నీటిపారుదల శా ఖ కొల్లేరు సరస్సు ప్రాంతం వివరణాత్మక కాంటూ ర్ మ్యాపులను అందించాలన్నారు. అలాగే ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. జేసీలు అభిషేక్ గౌడ, టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా అటవీ శాఖాధికారి బి.విజయ, డీ ఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజ నీర్ శేషుబాబు, ఎస్‌ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమేష్, డీపీఓ కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌బాబు ప్రకటనలో తెలిపారు. 20 వరకు వారోత్సవాలు కొనసాగుతాయన్నారు.


