126 సెల్‌ఫోన్ల్ల రికవరీ
భీమవరం: జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల 11వ విడత రికవరీ, పంపిణీ కార్యక్రమా న్ని స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చేతులమీదుగా సుమారు రూ.18.90 లక్షల విలువైన 126 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 9154966503కు వాట్సాప్ లో హాయ్/ హెల్ప్ అని మెసేజ్ చేసి, లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నింపడం ద్వారా చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను పొందవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తంగా సుమారు రూ.2.60 కోట్ల 1,738 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. ఎవరికై నా సెల్‌ఫోన్ దొరికితే సొంతానికి వాడు కోకుండా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో అందించాలని సూచించారు. లేకుంటే కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్నారు. సెల్‌ఫోన్ల రికవరీకి కృషిచేసిన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ బృంద సభ్యులు ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నిషా, డి.రత్నారెడ్డి, వీజీఎస్ కుమార్, బి.శ్రీనివాస్, కె.వెంకటేశ్వరరావు, పి.లక్ష్మీకుమారి, కె.పాపారావు, కె.ప్రసాద్‌బాబు, కె.అబ్బాస్, ఎస్.భాస్కర్, ఎంవీడీ ప్రసాద్, ఎం.అనిల్‌కుమార్‌ను జిల్లా ప్రత్యేకంగా అభినందించినారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
బాధితులకు అందజేసిన ఎస్పీ


