నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాట్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హైస్కూళ్లలో పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా ఏలూరు ఎంఈఓ–1 సర్దుబాటు చేశారని, వీటిని వెంటనే సరిచేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డీఈఓకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈనెల 7న ఒక బీఎస్ స్కూల్ అసిస్టెంట్‌ను ఇంగ్లిష్ పోస్టులో సర్దుబాటు చేశారని డీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఈనెల 13న ఏలూరు ఉప విద్యాశాఖాధికారి 12 పేర్లతో సర్దుబాటు జాబితా విడుదల చేశారన్నారు. ఆ జాబితా లో రెండో పేరులో ఉన్న ఉపాధ్యాయుడు బీఎస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సీనియర్‌గా ఉన్నా ని బంధనలు మీరి సర్దుబాటు చేశారన్నారు. అలాగే క్లస్టర్‌లో లేని ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ సీనియర్ ఉపాధ్యాయుడిని గోపన్నపాలెంలో, సీనియర్ అ యిన బీఎస్ స్కూల్ అసిస్టెంట్‌ను ఏలూరు శ్రీరామ్ నగర్‌లో నియమించారన్నారు. అలాగే ఒక స్పెషల్ గ్రేడ్ టీచర్‌ను గైనెస్ట్ బీఎస్ స్కూల్ అసిస్టెంట్‌గా పినకడిమి హైస్కూల్‌లో నియమించారన్నారు. ఆ యా సర్దుబాట్లను సరిచేయాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రామారావు, కార్యదర్శి డీకేఎస్‌ఎస్ ప్రకాష్‌రావు, జిల్లా నాయకుడు నాయుడు కొండయ్య, నగర ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాస్ ఉన్నారు.


