పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
భీమవరం: పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తాను ముందుంటానని, ఏ సమస్యనైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని జిల్లా ఖజానాధికారి మహ్మద్ మజ్హర్ బేగ్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం భీమవరం ఉప ఖజానా కార్యాలయానికి సందర్శనకు వచ్చిన ఆయన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా భీమవరం యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ఖజానాధికారి అల్లూరి రవివర్మ, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు గాతల జేమ్స్, సాగిరాజు సత్యనారాయణ రాజు, కోశాధికారి రవిప్రసాద్, భీమవరం యూనిట్ కార్యదర్శి పి.సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక డీఎన్‌ఆర్ కాలేజీలో గత రెండు రోజులుగా వివిధ క్రీడాంశాల్లో జరుగుతున్న ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగుల ఆటల పోటీలు ముగిశాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.మోహన్ దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 19 విభాగాలలో పోటీల్లో నిర్వహించగా ఎక్కువమంది క్రికెట్, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ ఆటల్లో పాల్గొన్నట్లు తెలిపారు. క్రీడల్లో మొత్తం 58 మంది పాల్గొనగా 44 మంది పురుషులు, ఎనిమిది మంది సీ్త్రలు వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని డీఎస్‌డీఓ ఎన్.మోహన్‌దాస్ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): శ్రీ కృష్ణా సుజుకి సంస్థ బెస్ట్ వాల్యూ షోరూమ్ సరికొత్త హంగులతో స్థానిక సత్రంపాడులో గురువారం ప్రారంభించారు. షోరూం అధినేత నారా శేషు మాట్లాడుతూ తమ షోరూమ్‌లో ప్రతి వాహనం ఎక్సేంజ్‌పై రూ. 2వేలు వరకు లాయల్టీ బోనస్ ఇస్తామన్నారు. అలాగే ప్రతి సుజుకి పాత వాహనం కొనుగోలుపై 1 సంవత్సరం వారంటీతో వస్తుందని, ఈ షోరూమ్‌లో సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ కృష్ణా గ్రూపు అధినేత నారా వెంకట శేషగిరిరావు, సుజుకి బెస్ట్ వాల్యూ హెడ్ అభిషేక్, సుజుకి రీజినల్ మేనేజర్ శివరామకృష్ణ, సుజుకి ఏరియా మేనేజర్ అరుణ్ కుమార్, సర్వీస్ ఏరియా మేనేజర్ రాజశేఖర్, శ్రీ కృష్ణా సుజుకి సిబ్బంది పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి


