మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని డాక్టర్ బీఆర్‌అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూమ్, కూగాయలు, పప్పు, నూనె, కోడిగుడ్లు, తదితర నిత్యావసర సరుకుల నాణ్యతను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నం వండినప్పుడు గంజి వార్చుతుండడాన్ని ఆయన గమనించారు. ప్రభుత్వం ఎన్నో పోషక విలువలున్న ఫోర్ట్‌ఫైడ్ బియ్యాన్ని పాఠశాలలకు అందజేస్తుందని ఆ బియ్యాన్ని అన్నం వండేటప్పుడు గంజి వార్చితే పోషకాలన్నీ బయటకు పోతాయని, ఇక నుంచి అన్నం వార్చకూడదని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్నం వండిన అన్నం, కూరలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి ప్రతాప్ రెడ్డి, లీగల్ మెట్రాలజీ అధికారులు, స్థానిక సీఎన్‌ఎటి. వెంకటేశ్వరరావు, ఏపీ గురుకుల పాఠశాలల సొనైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బి.ఉమాకుమారి, ప్రిన్సిపాల్ టి.గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో పర్యటన
బుట్టాయగూడెం: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి బుధవారం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. బుట్టాయగూడెం మండలంలోని మర్లగూడెం అంగన్‌వాడీ కేంద్రం, బుట్టాయగూడెంలోని ఏపీ గురుకుల పాఠశాలలోని భోజనశాలను సందర్శించారు. వంటలను స్వయంగా రుచి చూశారు. విద్యార్థులకు అనుగుణంగా మంచినీటి సదుపాయంలే దని ప్రిన్సిపాల్ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే బీసీ కాలనీ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను కూడా సందర్శించారు. కేఆర్‌పురం ఐటీడిఏ డిప్యూటీ డైరెక్టర్ పి.జనార్థన్‌రావు, ఎంఈఓ టి.బాబూరావు, ఏటీడబ్ల్యూఓలు శ్రీవిద్య, జనార్థన్, సీడీపీఓ యూవి పద్మావతి, సివిల్ సప్లయి ఆర్‌ఐ కె.పద్మావతి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


