ముగిసిన సివిల్ సర్వీస్ జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: జిల్లా సివిల్ సర్వీస్ జట్ల ఎంపిక పోటీలు ముగిశాయి. బుధవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రెండోరోజు క్రీడాధికారులు క్రికెట్, యోగా జట్లు ఎంపిక చేశారు. క్రికెట్ జట్టుకు పవన్‌శ్రీనివాస్‌రెడ్డి, బి నవీన్‌సూర్య, కె రాజేష్, ఎం.కృష్ణారావు, ఏ సునీల్‌బాబు, ఎండీ మొహనీస్, పీఎన్‌డీవీ ప్రసాద్, జె సత్యనారాయణ, డి రవికుమార్, జి సతీష్‌కుమార్, షేక్ రియాజ్, డి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. మరోపక్క యోగా జట్టుకు మొనగంటి మహీంద్రాచార్యులు, ఇరస అమ్మాజీ, డ్యాన్స్ జట్టుకు పాయం రత్నకుమారి ఎంపికై నట్లు డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ వెల్లడించారు. బుధవారం పోటీలకు 20 మంది హాజరు కాగా 15 మంది ఎంపికయ్యారన్నారు. మొత్తంగా 106 మంది క్రీడాకారులు జిల్లా జట్లుకు ప్రాతినిధ్యం వహించనున్నారని వివరించారు. ఎంపికై న వారు ఈ నెల 19వ తేదీ నుంచి 22 వరకూ ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ పోటీల్లో పాల్గొనాల్సి ఉందన్నారు.


