విద్యా స్ఫూర్తి ప్రదాత మూర్తిరాజు
భీమవరం: విద్యాదానానికి తమ యావదాస్తిని ఖర్చు చేసిన ‘విద్యాస్ఫూర్తి ప్రదాత’ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ఆదర్శప్రాయుడని కలెక్టర్ చదలవాడ నాగరాణి కొనియాడారు. విద్యాదాత మూర్తి రాజు 13వ వర్థంతిని పురస్కరించుకొని బుధవారం భీమవరం అడ్డ వంతెన సమీపంలోని మూర్తి రాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లెక్టర్ మాట్లాడుతూ 1962 నుంచి మారుమూల ప్రాంతాల్లో 68 విద్యాసంస్థలు నెలకొల్పి భావి పౌరులకు విద్యా విలువలను, భారతీయ సంస్కృతిని అందించాలనే లక్ష్యంతో మూర్తి రాజు కృషి చేశారని తెలిపారు. సర్వోదయ మండలి, మానవత సేవా సంస్థ, అల్లూరి సేవాసమితి విజ్ఞాన వేదిక, వసుధ ఫౌండేషన్, పుర ప్రముఖులు పాల్గొన్నారు. విద్యలోనూ, క్రీడల్లోనూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘మూర్తి రాజు స్ఫూర్తి అవార్డులు’ అందజేశారు.


