ఫుడ్ కమిషన్ తనిఖీలు
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కృష్ణ కిరణ్ బుధవారం పాలకొల్లు, నరసాపురం, పెనుమంట్ర, వీరవాసరం మండలాల్లో వివిధ ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు ఎమ్మెల్సీ పాయింట్లు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ముందుగా పాలకొల్లు మండలంలోని దిగమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం అమలుపై ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం మెనూ అమలుపై విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం చిన మామిడిపల్లి మున్సిపల్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. తదుపరి ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను, నరసాపురం ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను, పెనుమంట్రలో ఎమ్మెల్సీ పాయింట్ సందర్శించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ, జిల్లా సివిల్ సప్లయి అధికారి ఎన్.సరోజ, మిడ్ డే మీల్స్ అసిస్టెంట్ డైరెక్టర్, ఐసీడీఎస్ సిబ్బంది, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అధికారులు, ఎంఈఓలు ఉన్నారు.


