దివ్యాంగ పింఛన్లకు కోత | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ పింఛన్లకు కోత

Aug 20 2025 5:01 AM | Updated on Aug 20 2025 5:01 AM

దివ్య

దివ్యాంగ పింఛన్లకు కోత

న్యూస్‌రీల్‌

నేతల ఇళ్లను ముట్టడిస్తాం

15 నెలల్లో ఒక్క పింఛన్‌ లేదు

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సాక్షి, భీమవరం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు ప్రస్తుతం ఉన్న పింఛన్లు, ఇస్తున్న సాయానికి కోత పెట్టే పనిలో పడింది. తొలి విడతగా దివ్యాంగ, ఆరోగ్య పింఛన్లపై కన్నేసింది. జిల్లాలో దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారులు 27,193 మంది ఉండగా పక్షవాతం, కిడ్నీ, లివర్‌ ఇతర ఆరోగ్య సమస్యలతో పింఛన్‌ పొందుతున్న వారు 1,581 మంది వరకు ఉన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.6,000, ఆరోగ్య పింఛన్‌ లబ్ధిదారులకు రూ.15,000, ఇతర సామాజిక పింఛన్లకు రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. వెరిఫికేషన్‌, రీ అసెస్‌మెంట్‌ పేరిట లబ్ధిదారులకు ఇటీవల వైద్య బృందాలతో వైకల్య నిర్ధారణ, ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఆరోగ్య పింఛన్‌ లబ్ధిదారులు 1,510 మందికి పరీక్షలు చేసి రూ.15,000 సాయం పొందేందుకు 566 మంది మాత్రమే అర్హులుగా నిర్ధారించారు.

పింఛన్‌ నిలిపివేస్తామంటూ నోటీసులతో ఆందోళన

మిగిలిన వారిలో 603 మందిని దివ్యాంగ పింఛన్లకు, 341 మందిని వృద్ధాప్య పింఛన్లకు మార్పుచేశారు. ఈ మేరకు వారికి అందించే సాయం భారీగా తగ్గనుంది. 15,596 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి 13,690 మంది మాత్రమే అర్హులుగా తేల్చారు. 1,289 మందిని వృద్ధాప్య పింఛన్లకు మార్పుచేయగా మిగిలిన వారికి తాత్కాలిక వైకల్యంగా, 40 శాతం లోపు ఉన్నట్టుగా సర్టిఫికెట్లు జారీచేయడంతో ఇప్పుడు వారి పింఛన్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వీరిలో పుట్టుక నుంచి వైకల్యంతో బాదపడుతున్న వారు, ఎన్నో ఏళ్లుగా పింఛన్‌ తీసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నట్టు చెబుతున్నారు. వైకల్య శాతం తక్కువ, తాత్కాలిక వైకల్యం కారణంగా పింఛన్‌ నిలిపివేస్తున్నట్లు మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల నుంచి నోటీసులు అందడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నోటీసులు తీసుకుని సహాయకులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు.

స్పౌజ్‌ పింఛన్లను కొత్తవి అంటూ ప్రచారం

గతంలో పింఛన్‌ లబ్ధిదారుడు మృతిచెందితే మరుసటి నెల నుంచే అతని భార్య(స్పౌజ్‌)కు పింఛన్‌ మంజూరయ్యేది. కూటమి వచ్చాక పింఛన్‌ సైట్‌ను క్లోజ్‌ చేయడంతో ఈ తరహా పింఛన్ల మంజూరు ఆగిపోయింది.

నవంబరు తర్వాత మృతిచెందిన వారికి మాత్రమే ఇస్తూ వచ్చారు. దీంతో అంతకు ముందు భర్తను కోల్పోయిన వారు స్పౌజ్‌ పింఛన్ల కోసం ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు జిల్లాలోని 3,988 మందికి ఆగస్టు నుంచి స్పౌజ్‌ పింఛన్లు పంపిణీ చేశారు. వీటినే కొత్త మంజూరు అన్నట్టుగా కూటమి నాయకులు హడావుడి చేయడం గమనార్హం. భర్తను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద మహిళలు ఒక్కరికీ సాధారణ వితంతు పింఛన్‌ మంజూరు చేయలేదు.

కుమార్‌రాజాకు వచ్చిన నోటీస్‌ చూపిస్తున్న దృశ్యం

ఈ ఫొటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు కుమార్‌రాజా. వయస్సు ఆరేళ్లు. నరసాపురం రూరల్‌ ఎల్‌బీ చర్లకు చెందిన ఈ బాబుకు పుట్టుక నుంచే మెదడులో సమస్యతో కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. నడవలేడు. ఎక్కడికై నా ఎత్తుకుని తీసుకువెళ్లాల్సిందే. అన్నం కూడా ఎవరైనా తినిపించాల్సిందే. గతంలో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 90 శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో గత ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్‌ మంజూరైంది. ఇటీవల చేసిన రీ వెరిఫికేషన్‌లో తాత్కాలిక వైకల్యంగా నిర్ధారణ అయ్యిందని, పింఛన్‌ నిలిపివేస్తున్నట్టు ఎంపీడీఓ కార్యాలయం నుంచి నోటీసు అందింది. ఎల్‌బీ చర్ల గ్రామంలో 65 దివ్యాంగ పింఛన్లకు 14 మందికి నోటీసులు జారీ చేయడం గమనార్హం.

దివ్యాంగుల పింఛన్లు తొల గించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఉపేక్షించేది లేదు. దీనిపై త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం. కలెక్టరేట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడిస్తాం. దివ్యాంగుల పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం భారం కాదు. 1980 నుంచి దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలను తిరిగి పరిశీలించిన దాఖలాలు లేవు. దివ్యాంగుల వయసు పెరుగుతున్న కొద్దీ వైకల్యం కూడా పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు ఇవి గుర్తించాలి.

– అల్లాడి నటరాజు, వికలాంగుల సంక్షేమ

సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆకివీడు

డిజేబుల్డ్‌, ఆరోగ్య పింఛన్లు తగ్గించే పనిలో చంద్రబాబు సర్కారు

కొన్నింటిని ఓఏపీ పింఛన్లుగా మార్పు

నడవలేని వారికి సైతం వైకల్యం 40 శాతం లోపుందని నోటీసులు

ఆరోగ్య పింఛన్‌ లబ్ధిదారుల్లో సగానికి పైగా కత్తెర

పాలన చేపట్టిన 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయకపోవడం గమనార్హం. చివరిగా 2024 జనవరిలో గత ప్రభుత్వం 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జూలైలో కొత్తవి మంజూరు కావాల్సి ఉండగా జూన్‌లో కూటమి రాకతో వాటికి బ్రేక్‌ పడింది. జూన్‌ నాటికి జిల్లాలో 2,32,885 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,26,995కు తగ్గిపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా.

దివ్యాంగ పింఛన్లకు కోత 1
1/2

దివ్యాంగ పింఛన్లకు కోత

దివ్యాంగ పింఛన్లకు కోత 2
2/2

దివ్యాంగ పింఛన్లకు కోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement