
డీఆర్‌ఓ వెంకటేశ్వర్లుకు కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి
భీమవరం(ప్రకాశం చౌక్): డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లను కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సత్కరించారు. వెంకటేశ్వర్లు గతంలో డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోగా పనిచేశారు. 2024 అక్టోబర్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. ఆగస్టు 18న కేంద్రం కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
భీమవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్ చదవాలనుకునే అభ్యర్థులకు మరో అవకాశం వచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. ప్రవేశాలకు వచ్చే నెల 16లోపు అపరాధ రుసుం రూ.200 చెల్లించి దరఖాస్తులు పొందాలని అన్నారు. ఓపెన్ స్కూల్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యలమంచిలి: గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో కనకాయలంక కాజ్‌వే మంగళవారం నీట మునిగింది. దీంతో కనకాయలంక ప్రజలు అడుగున్నర లోతు వరదనీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. వరదనీరు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, స్కూల్ విద్యార్థుల రాకపోకలకు అంతరాయం కలగకుండా పడవలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గ్రంధి నాగ వెంకట పవన్‌కుమార్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, వరద తగ్గే వరకు ఇళ్లకే పరిమితం కావాలని ఆయన కోరారు. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బుధవారం కాజ్‌వేపై వరదనీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నా, సాయంత్రానికి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఫేజ్–1, ఫేజ్–2 రీసర్వే నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్ నుంచి మంగళవారం రీసర్వే, గ్రామాల సరిహద్దుల నిర్ధారణ, జాయింట్ ఎల్‌పిఎంల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేజ్ వన్–1 లో పూర్తి కావాల్సిన ఐదు గ్రామాలలో రీ సర్వే పనులను వచ్చే శనివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేజ్–2లో జరుగుతున్న 27 గ్రామాలకు సంబంధించి ప్రతి రైతుకు 9(2) నోటీసు అందించాలన్నారు. రీసర్వే చేయాల్సిన 72 గ్రామాల గ్రామ సరిహద్దులను రెండు రోజుల్లోగా నిర్ధారించాలన్నారు. భూమి సరిహద్దు సమస్య దరఖాస్తులు, ఆన్‌లైన్ సబ్ డివిజన్ దరఖాస్తులు, పీజీఆర్‌ఎస్‌లో అందిన దరఖాస్తుదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. వచ్చే వారంలోగా సమస్యల పరిష్కారంపై ప్రగతి చూపించని వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.
కై కలూరు: కొల్లేటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏలూరు జిల్లా వైద్యాధికారి జాన్ అమృతం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల 12న కొల్లేటికోట పీహెచ్‌సీ సమస్యలపై ‘లంకంత ఆస్పత్రి.. డాక్టర్లు లేరు’ శీర్షికతో కథనం వెలవడింది. దీనిపై డీఎంహెచ్‌వో పరిశీలన చేశారు. ఆస్పత్రిలో శుభ్రత పాటించాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును త్వరగా భర్తీ చేస్తా మన్నారు. డాక్టర్ల నియామకం చేపడతామన్నారు.

డీఆర్‌ఓ వెంకటేశ్వర్లుకు కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి