ఎడతెగని వాన | - | Sakshi
Sakshi News home page

ఎడతెగని వాన

Aug 19 2025 6:47 AM | Updated on Aug 19 2025 6:47 AM

ఎడతెగ

ఎడతెగని వాన

రెండు రోజులు భారీ వర్షాలు

మురుగుకోడుతో ముంపు

రైతులను ఆదుకోవాలి

సాక్షి, భీమవరం: పశ్చిమ, మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో సో మవారం జిల్లా అంతటా వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. 32 వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో 15.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. వేకువజాము మొదలై మధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే ఉంది. కొన్నిప్రాంతాల్లో సాయంత్రం వరకు జల్లులు కొనసాగాయి. పాలకొల్లు, ఉండి, నరసాపురం, పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో ఎక్కువగా, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆకివీడు, అత్తిలి తదితర చోట్ల మో స్తరుగా వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అధిక శాతం మంది ఇళ్లకే పరిమితం కాగా విద్యాసంస్థలు, కార్యాలయాలు, షాపులకు వెళ్లేవారు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. జనం లేక మార్కెట్లు వెలవెలబోయాయి. రోడ్లు మరమ్మతుల్లో భాగంగా తూతూమంత్రంగా గుంతలు పూడ్చడంతో వర్షాలకు రాళ్లుపైకి లేచిప్రమాదభరితంగా తయారయ్యాయి.

నీటమునిగిన పంట పొలాలు

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు నీటమునిగాయి. జిల్లాలోని 2.8 లక్షల ఎకరాల్లో రైతులు తొలకరి సాగు చేస్తున్నారు. 88 శాతం విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి. డెల్టా ఎగువ ప్రాంతమైన తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో నాట్లు దాదాపు పూర్తికాగా ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని శివార్లలో ఇంకా సాగుతున్నాయి. ముందుగా నాట్లు వేసిన చోట చేలు పిలకలు వేసే దశలో ఉన్నాయి. వర్షాలతో జిల్లావ్యాప్తంగా దాదాపు 32 వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగినట్టు వ్యవసాయ వ ర్గాల ప్రాథమిక అంచనా. తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో ఐదు రోజులుగా పొలాలు నీట మునిగి ఉన్నాయని, నాట్లు పనికి రాకుండా పోతాయని రైతులు చెబుతున్నారు. వర్షం తెరిపివ్వకుంటే మరిన్ని పొలాలు నీట మునిగే అవకాశం ఉందంటున్నారు. రెండు, మూడు రోజుల క్రితం ఊడ్చిన పొలాల్లోని నాట్లు పైకి తేలిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పొలాల్లోని ముంపు నీరు బయటకు పోయేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, నాట్లు వేసిన నీట మునిగి మొక్కలు చనిపోతే మనేదలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

వరిలో జాగ్రత్తలు తప్పనిసరి

ముంపు పొలాల్లో నష్టనివారణకు మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం.గిరిజారాణి పలు సూచనలు చేశారు.

● నారుమడి లేక ఎద పద్ధతిలో విత్తిన పొలం నీట మునిగితే మొలక శాతం తగ్గుతుంది. విత్తిన వారం రోజుల నుంచి నెల రోజుల్లో ఐదు రోజులకు పైగా నారుమడి నీట మునిగి ఉంటే నారు దెబ్బతినే అవకాశం ఉంది. వీలైనంత తొందరగా నీటిని బయటకు తీసివేసి, తర్వాత 5 సెంట్ల నారుమడికి ఒక కిలో యూరియా, కిలో పోటాష్‌ వేయాలి. ఈ వాతావరణంలో తెగుళ్లు సోకకుండా లీటరు నీటికి ఒక గ్రాము కార్బెన్డిజిమ్‌ లేదా 2.0 గ్రాములు కార్బెన్డిజిమ్‌, మాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి.

● పిలకల దశలో సాధారణ రకాలు ఐదు రోజుల వరకు, ఎంటీయూ 1064, పీఎల్‌ఏ 1100 వారం రోజుల వరకు ముంపును తటు్‌ుట్కంటాయి. ఆకులు పైకి కనిపిస్తూ 30 నుంచి 40 సెంటీమీటర్ల నీరు నిలబడే పల్లపు ప్రాంతల్లోని మధ్యస్థ ముంపుని కూడా తట్టుకుంటాయి.

● ఎంటీయూ 1232 రకం 10 నుంచి 12 రోజుల పాటు తాత్కాలిక ముంపును కూడా తట్టుకుంటుంది. పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత త్వరగా నీటిని తీసివేసి ఎకరానికి 20 కిలోల యూరియా, 10 నుంచి 15 కిలోల పొటాష్‌ అదనంగా వేయాలి.

అత్తిలి మండలం కొమ్మరలో నీట మునిగిన పొలాలు

జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి

భీమవరం (ప్రకాశంచౌక్‌): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. భీమవరం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో ఆయన వెబ్‌ఎక్స్‌ ద్వారా సమీక్షించారు. రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి అందించాలన్నారు. ముంపు చేలల్లో నీరు బయటకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలు, డ్రెయిన్లలో అడ్డంకులు తొలగించాలన్నారు. గట్లు బలహీనంగా ఉంటే పటిష్టం చేయాలన్నారు. లోతటు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ జిల్లాలోని సచివాలయ సిబ్బంది షిఫ్టుల వారీగా విధుల నిర్వహించాలన్నారు. అధికారులంతా జిల్లా ప్రధాన కేంద్రంలోనే ఉండాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామని, 24 గంటలు సేవలందిస్తారన్నారు.

నిండా ముంచేను

స్తంభించిన జనజీవనం

లోతట్టు ప్రాంతాలు జలమయం

32 వేల ఎకరాల్లో నీట మునిగిన చేలు

జిల్లాలో 15.4 మి.మీ సగటు వర్షపాతం నమోదు

గణపవరం: మండలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న చేలను జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పరిశీలించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. జల్లికొమ్మరలో నీట మునిగిన సార్వా పైరును పరిశీలించా రు. వియర్‌ మురుగుకోడు కారణంగా 500 ఎక రాల పైరు నీట మునిగిందని, ఐదు రోజులుగా నా ట్లు నీటిలో ఉన్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. శాశ్వత పరిష్కారంగా పంట, మురుగు కాలువలను పూర్తిస్థాయిలో తవ్వాలన్నా రు. పంటల బీమా పరిహారం ఇప్పించాలని కో రారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని జేసీ అన్నారు. ముందుగా తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి మ్యూటేషన్‌ ఫైల్స్‌ను పరిశీలించారు. వ్యవసా య అధికారి జెడ్‌. వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ వైకేవీ అప్పారావు, ఏఓ ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ ఉన్నారు.

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ

వర్షాల కారణంగా తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో ముంపు ప్రాంతాల్లో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పర్యటించారు. కె.పెంటపాడు, బోడపాడు, వల్లూరుపల్లి, మంజిపాడు, యనమలపల్లి తదితర గ్రామాల్లో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించి రైతులు, స్థానికులతో మాట్లాడారు. డ్రెయిన్లు లాగక ఐదు రోజులుగా పొలాల్లోని ముంపు నీరు బయటకు పోవడం లేదని, నాట్లు ఎందుకు పనికి రాకుండా పోతాయని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

ఎడతెగని వాన 1
1/2

ఎడతెగని వాన

ఎడతెగని వాన 2
2/2

ఎడతెగని వాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement