
ఉప్పుటేరులోకి వరద నీరు
ఆకివీడు: కొల్లేరు సరస్సులోకి కృష్ణా, గోదావరి జలాలతో పాటు, తమ్మిలేరు, బుడమేరు, ఎర్రకాలువ నీరు ప్రవేశించడంతో కొల్లేరు, ఉప్పుటేరుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. సోమ వారం ఉప్పుటేరులో నీటి ప్రవాహాన్ని కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరా జు పరిశీలించారు. తాడినాడ వైపు ఉప్పుటేరుకు చేర్చి ఉన్న చేపల చెరువులను కలెక్టర్ పరిశీలించారు. రైల్వే వంతెనల వద్ద పేరుకుపోతున్న కిక్కిస, గుర్రపుడెక్కల తొలగింపును చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి
భీమవరం (ప్రకాశంచౌక్): అంగన్‌వాడీ కేంద్రా ల్లో మౌలిక వసతుల కల్పనతో బలోపేతానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.
ఎకై ్సజ్‌శాఖ అధికారి నాగప్రభుకుమార్
భీమవరం: జిల్లాలో బార్లు ఏర్పాటుకు దర ఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసి నట్టు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ అధికా రి కేవీ నాగప్రభుకుమార్ తెలిపారు. సోమ వారం భీమవరం ఎకై ్సజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 28 బార్లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో ఏడు, నరసాపురంలో మూడు, పాలకొల్లులో ఆరు, తణుకులో ఆరు, ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున కేటాయించామన్నారు. ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రిజర్వేషన్ ఖరారు
కల్లుగీత కార్మికులకు కొత్తగా మంజూరైన మూ డు బార్లుకు కులాల వారీగా రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ ద్వారా కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఎంపిక చేశారు. భీమవరం, తాడేపల్లిగూడెంలో శెట్టి బలిజలకు, పాలకొల్లులో గౌడ కులస్తులకు ఒక్కోటి చొప్పున కేటాయించారు. వీరు ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 30న డ్రా తీసి బార్లు కేటాయిస్తామన్నారు.
అత్తిలి: రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్‌లు తొల గించడం హేయమని వైఎస్సార్‌సీపీ దివ్యాంగ విభాగం జిల్లా అధ్యక్షులు బుడితి సుజన్‌కుమా ర్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైకల్యం పునః పరిశీలన పేరుతో దివ్యాంగులను నెలలు తరబడి తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాలు కాదపలేని, ఏం పని చేసుకోలేని పలువురు దివ్యాంగుల పింఛన్లు తొలగించి వారి జీవనభృతిని లా క్కోవడం అత్యంత హేయమైన చర్య అని అన్నా రు. తొలగించిన పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్‌ను ది వ్యాంగులు ముట్టడించారని, ప్రభుత్వం తక్షణ మే స్పందించి సమస్య పరిష్కారించాలని, లే కపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు దిగుతామని సుజన్‌కుమార్ హెచ్చరించారు.

ఉప్పుటేరులోకి వరద నీరు