
●ఇదేనా.. పంట కాలువల ప్రక్షాళన?
లక్షలాది రూపాయలు వెచ్చించి పంట కాలువలను ప్రక్షాళన చేశారుగా.. అప్పుడే ఇలా అయిపోయాయి ఏంటి అంటూ రైతులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉండి నుంచి పాములపర్రు వెళ్లే పంట కాలువ ఓ వైపు చిట్టడవిలా మారితే.. మరోవైపు గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో నిండిపోవడంపై అవాక్కవుతున్నారు. గత వేసవిలో కాలువల్లో పూడికతీత పనులను అధికారులు, కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా కానిచ్చేశారని, కాలువల్లోని మట్టిని పొక్లెయిన్‌తో గట్టుపై వేసి చేతులు దులుపుకున్నారని అంటున్నారు. దీంతో కొద్దిరోజుల్లోనే పంట కాలువలు ఇలా తయారయ్యాయని వాపోతున్నారు. కాలువల్లో అడ్డంకులతో పొలాలకు నీరందడం లేదని ఆవేదన చెందుతున్నారు. – ఉండి

●ఇదేనా.. పంట కాలువల ప్రక్షాళన?