
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ ప్రయాణికురాలి కాలును ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు చేసింది. తూర్పుగోదావరి జిల్లా జగ్జంపేటలో రేవాడ రాజేశ్వరి అనే మహిళ తన సోదరి కుమార్తె ఆశ్వనీను బస్సు ఎక్కించేందుకు జగ్గం పేటకు వచ్చారు. జగ్గంపేట బస్టాండ్‌లో అశ్వినినీ బస్సు ఎక్కించి ఆమెకు బ్యాగ్ ఇస్తుండగా.. ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ విపరీతంగా పెరిగడంతో డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో రాజేశ్వరి కాలుజారి కిందపడింది. బస్సు టైరు ఎక్కడంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది.

ప్రమాదంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో బాధితురాల్ని ఓ స్ట్రెచ్చర్ మీద రోడ్డు మీదకు తోసుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.