
యువకుడిని కాపాడిన పోలీసులు
భీమడోలు: మనో వైకల్యంతో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడిని శుక్రవారం సాయంత్రం భీమడోలు పోలీసులు కాపాడారు. పూళ్ల గ్రామానికి చెందిన గురువెల్లి రాజు తాపీ పని చేసేవాడు. ఇటీవల మద్యానికి బానిస కావడంతో తల్లి మందలించింది. దీనితో రాజు చనిపోతానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్, ఏఎస్సై వెంకటేశ్వరరావు హుటాహుటిన పూళ్ల వెళ్లి అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యయత్నానికి సిద్ధంగా ఉన్న రాజును వారు పట్టుకున్నారు. అతనికి భోజనం పెట్టించి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.
ఉంగుటూరు: మండలంలోని వెల్లమిల్లిలో పాఠశాల వద్ద జెండా ఆవిష్కరణకు ఉపయోగించిన ఐరన్ పైపు శుక్రవారం సాయంత్రం దించబోతుండగా.. పక్కనే ఉన్న విద్యుత్త్ వైర్లు మీద పడటంతో షాక్‌కు గురై ఉసురుమర్తి భీమరాజు(49) అక్కడకక్కడే మృతిచెందాడు. భీమరాజుకు కుమరుడు, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.