
కన్నాపురంలో వ్యక్తి ఆత్మహత్య
కొయ్యలగూడెం: ఇచ్చిన బాకీలు వసూలు కాకపోవడంతో మనస్తాపానికి గురైన కన్నాపురం గ్రామానికి చెందిన మజ్జి నరసింహారావు (40) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరికి నరసింహరావు అప్పు ఇవ్వగా, అవి వసూలు కాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం రాత్రి వాట్సప్‌లో తన కుటుంబ సభ్యులకు ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ చేశాడు. మృతుడు తండ్రి సత్యనారాయణ, బంధువులు నరసింహరావు కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని ఓ రైతుకు చెందిన బావి వైపు వెళ్ళినట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి వారిని చూసిన నరసింహారావు వెంటనే బావిలోకి దూకేశాడు. దీంతో స్థానికుల సాయంతో బయటకు తీసుకొచ్చి హాస్పటల్ కు తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం కై కరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఎంఎం.పురం గ్రామానికి చెందిన బూర్ల మహేష్‌కుమార్(35) అక్కడికక్కడే చనిపోయాడు. మహేష్‌కుమార్ బైక్‌పై తణుకు వెళ్తుండగా కై కరం శివారులో వెనుక నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడకక్కడే మరణించాడు. కారు డ్రైవరు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరుకు చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కై కలూరు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం విక్రయాలు నిషేధం. అయినప్పటికీ బెల్టు దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఎకై ్సజ్ ప్రత్యేక బృందం దాడులు చేసి శుక్రవారం పట్టుకుంది. అధికారుల వివరాల ప్రకారం ముదినేపల్లి మండలం కాకరవాడకు చెందిన కాగిత నాగేశ్వరరావు నుంచి 9 క్వార్టర్ బాటిల్స్, మండవల్లి మండలం భైరవపట్నంలో వలపుల చంద్రరావు నుంచి 7 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 సందర్భంగా గురువారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు నియోజకవర్గంలో 22 మద్యం దుకాణాలకు సీజ్ వేశామన్నారు.