
డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి
ద్వారకాతిరుమల: బైక్‌పై వేగంగా వెళుతున్న యువకుడు ముందు వెళుతున్న టీవీఎస్ మోపెడ్‌ను, ఆ తరువాత డివైడర్‌ను ఢీకొట్టి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మోపెడ్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన మీసాల జగదీష్(25)కు ఏడాది క్రితం వివాహమైంది. జగదీష్, అతని అన్నయ్య ద్వారకాతిరుమలలోని స్వీట్లు తయారు చేసే పని చేస్తున్నారు. ఉదయం పనికి వెళ్లిన జగదీష్ తరువాత కడుపులో నొప్పిగా ఉందని చెప్పి, రూంకి వెళ్లి పడుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు భీమడోలు బయల్దేరాడు. ముందు వెళ్తున్న మోపెడ్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో మోపెడ్‌తో సహా దానిపై వెళ్తున్న ఫణి, అతని తాతయ్య రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫణికి తీవ్ర గాయాలుపాలు కాగా, అతని తాతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ యుజే విల్సన్, ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.