
నీటమునిగిన వరిచేలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మేజరు మురుగుకోడు, పందికోడు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మీడియం డ్రెయిన్లు రంగారావు కోడు, రాచకోడు, సంతకోడు, లింగం కోడు, ఆస్మాకోడు నిండుగా ప్రవహిస్తున్నాయి. దాంతో వేలాది ఎకరాలు నీటమునిగాయి. వీఏ పురం, కాగుపాడు, కాకర్లమూడి, దొంతవరం, రావులపర్రు, రామన్నగూడెం, కై కరం ఆయకట్టులో పంటపొలాలు నీటమునిగి ఉన్నాయి. పంటచేల నుంచి నీరు కొల్లేరు వైపు ప్రవహిస్తోంది. నారాయణపురం ఆర్‌అండ్‌బీ రోడ్డు, యర్రమళ్ల, వెల్లమిల్లి, ఎ.గోకవరం రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. మెట్ట ప్రాంతంలోని 22 మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండిపోయాయి. నాచుగుంట పట్టెమ చెరువు, ఉంగుటూరు ఎర్ర చెరువు, వెల్లమిల్ల చెరువు, నల్లమాడు చెరువు, గోపినాథపట్నం పెద్ద చెరువు నిండి పొంగి పొర్లుతున్నాయి. రెండు రోజుల్లో నీరు లాగితే రైతులు ఊపిరి పీల్చుకుంటారు. లేకుంటే నష్టపోయే పరిస్థితి నెలకొంది.

నీటమునిగిన వరిచేలు