
● బాలయోగి వంతెనకు పరదాలు
ఏలూరులోని తమ్మిలేరుపై నిర్మించిన బాలయోగి వంతెనపై కార్పొరేషన్ అధికారులు వంతెనకు ఇరువైపులా పరదాలు కట్టారు. బాలయోగి వంతెన తమ్మిలేరులో వ్యర్థాలు వేస్తున్నారని ‘సాక్షి’ మీడియాలో వస్తున్న వరుస కథనాలకు అధికారులు స్పందించి వ్యర్థాలు వేయకుండా ఇరువైపులా ఇదిగో ఇలా పరదాలు ఏర్పాటు చేశారు. అయినా చుట్టుపక్కల వారు చెత్త, వ్యర్థాలు వేయడం మాత్రం మానలేదు. స్థానికులకు అవగాహన కల్పించి తమ్మిలేరులో చెత్త, వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు

● బాలయోగి వంతెనకు పరదాలు