
నెత్తురు మరిగితే.. ఎత్తరా జెండా..
కై కలూరు: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో గడగడలాడించిన మహాత్ముని మనోనిబ్బరాన్ని కసిగా చూసిన కళ్లు అవి.. తెల్లదొరల లాఠీ దెబ్బలకు తట్టకున్న శరీరాలు అవి.. స్వాతంత్య్ర సమరోధ్యమంలో జైలు గోడలను తడిమిన చేతులు అవి.. ఆంగ్లేయుల ఫిరంగిలకు దమ్ముగా రొమ్ము చూపు పోరాట పఠిమను చూపిన తెగువ వీరి సొంతం.. అప్పటి స్వాతంత్య్ర సమరయోథులు జీవించిలేకున్నా.. వారి ఆశయాలు సజీవం. గోదావరి నదీ పాయల చుట్టూ ఉద్యమాన్ని ఉరకలేయించారు.. కృష్ణమ్మ చెంత పౌరుషంతో నురగలు కక్కించారు.. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమతీరంలో ఉద్యమ తీరుపై అలనాటి అలవోకనం
ఏలూరు.. సమరహోరు...
బ్రిటిష్ పాలనలో ఏలూరు ఒక మిలటరీ స్టేషన్‌గా ఉండేది. రాజమండ్రి గోదావరి జిల్లాల ప్రధాన కేంద్రంగా ఏలూరు పేరు గడించింది. ఈ పట్టణానికి 1937లో మహాత్మా గాంధీ, 1940లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విచ్చేసి స్వాతంత్య్ర సమరోత్సవాన్ని ప్రజల్లో రేకెత్తించారు. ఉమ్మడి జిల్లాలో గారపాటి సత్యనారాయణ, చింతలపాటి మూర్తిరాజు, మంగళంపల్లి చంద్రశేఖర్, ఉప్పాల కోదండరామయ్య వంటి ఎందరో స్వాతంత్య్ర పోరాటంలో ప్రతిభ చూపారు. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నూజివీడు, ఆచంట ప్రాంతాలు స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించాయి.
కదం తొక్కిన కై కలూరు
స్వాతంత్య్ర పోరాటంలో కై కలూరు ప్రాంతం కదం తొక్కింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని మహాత్మా గాంధీ నుంచి ఆదేశాలు రావడంతో కై కలూరు తాలూకా నడిరోడ్డుపై విదేశీ వస్త్రాలను ధైర్యంగా తగలబెట్టారు. దీంతో బ్రిటీష్ పాలకులు లాఠీలకు పని చెప్పారు. తుపాకులను ఎక్కుపెట్టారు. అయినా దమ్ముగా రొమ్ము చూపి వారిని ఎదిరించారు. ఎంతోమందిని జైల్లో నెట్టేశారు.
స్వాతంత్య్రం సిద్ధించి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అప్పట్లో కై కలూరు పాఠశాల వద్ద సమరవీరులు సేవలకు గుర్తుగా స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కై కలూరు పంచాయతీ తాలూకా పరిధికి చెందిన ఘంట పేరయ్య, కంతేటి కాశీవిశ్వనాథం, మాగంటి నాయుడమ్మ, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మాగంటి సత్యనారాయణ, రుద్రరాజు సూర్యనారాయణరాజు, చిర్రవూరి అచ్యుత రామయ్య, పొన్నాడ శ్రీరామచంద్రుడు, మేక తిరుపతయ్య, గుంటూరు రామదాసు, ఉన్నూరి నరసింహరాజు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లును లిఖించారు.
బ్రిటీష్ పాలకుల అడ్డా..
పూర్వం కై కలూరుని కై ంకర్యపురి అని పిలిచేవారు. కొల్లేరు సరస్సు కారణంగా ప్రముఖంగా పేరు గడిచింది. కై కలూరు తాలూకాగా ఉండేది. ఇక్కడి నుంచి బ్రిటీష్ పాలకులు కార్యక్రమాలను కొనసాగించేవారు. కై కలూరు మండలం వింజరం లాకుల వద్ద బ్రిటీష్ పాలనలో పడవలపై కూరగాయల సంత జరిగేది. ఆ గ్రామ సమీపంలో బ్రిటీష్ పాలకులు సేద తీరడానికి కట్టడాలు నిర్మించుకున్నారు. ఇక ప్రధాన పరిపాలన కై కలూరు నుంచి సాగేది. అందుకే కోర్టు, రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ ట్రెజరీ, ఆస్పత్రి, సబ్‌జైలు బ్రిటీష్ పాలకులు ఒకే వరుసలో నిర్మించారు. అప్పట్లో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఆందోళన చేసిన వారిని అరెస్టు చేసి కై కలూరు జైలుకు తరలించేవారు. శుక్రవారం ప్రంద్రాగస్టు సందర్భంగా అలనాటి స్వాతంత్య్ర సమరయోధుల వారసుల మనోభావాలు వారి మాటల్లోనే..
బ్రిటీష్ పాలకులపై గర్జించిన అలనాటి యోధులు
ఉమ్మడి పశ్చిమలో ఉవ్వెత్తున ఎగసిన స్వాతంత్య్ర కసి
కై కలూరులో కదం తొక్కిన ఉద్యమ వీరులు
పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న పల్లెలు

నెత్తురు మరిగితే.. ఎత్తరా జెండా..

నెత్తురు మరిగితే.. ఎత్తరా జెండా..