
దంచికొట్టిన వాన
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, ఆచంట, నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో ఽప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు భారీ వర్షంతో వాతావరణం చల్లబడి సేదతీరినా.. లోతట్టు ప్రాంతాల్లోని నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల అవస్థలు పడ్డారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భీమవరం(ప్రకాశం చౌక్): రానున్న 3 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమతంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. అందరూ ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఎవరికీ సెలవులు మంజూరు చేయమని స్పష్టం చేశారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాల్లో ఎక్కువ దృషి్‌ట్ పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కలెక్టరేట్‌లో 08816 299181 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు : భారీ వర్షాల నేపథ్యంలో 14న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఆదేశాలను ప్రైవేటు విద్యాసంస్థలు తప్పకుండా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇరగవరంలో భారీ వర్షం
జలమయమైన రహదారులు
నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
యంత్రాంగం అప్రమత్తం
నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన