
అనవసర పెట్టుబడితో నష్టపోవద్దు
గణపవరం: రైతులు అవసరం లేకుండా ఎరువులు, పురుగుమందులు వాడటం ద్వారా అనవసర పెట్టుబడితో నష్టపోతున్నారని, వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గణపవరం మండలం కేశవరంలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈపంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా రైతులను కలిసి ఏ రకాల పంటలు వేసి, పెట్టుబడి, ఎరువుల లభ్యత వంటి అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు. వ్యవసాయ సిబ్బంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను జేసీకి వివరించారు. సర్వే నంబరులో ఉన్న పొలానికి 20 మీటర్ల దగ్గరకు వెళ్తే కాని ఈపంట నమోదు కావడం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఆర్‌ఎస్ ప్రసాద్, రైతులు యాళ్ల పెద్దిరాజు, దండు గజపతిరాజు, దండు రామచంద్రరాజు పాల్గొన్నారు.