వైఎస్‌ ముద్రను చెరిపేసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ ముద్రను చెరిపేసే కుట్ర

Aug 14 2025 7:55 AM | Updated on Aug 14 2025 7:55 AM

వైఎస్‌ ముద్రను చెరిపేసే కుట్ర

వైఎస్‌ ముద్రను చెరిపేసే కుట్ర

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద యోగముద్రలో ఉన్న వైఎస్‌ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటును అడ్డుకునేందుకు వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2023లో ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేయాల్సి ఉంది. దీని తయారీకి అప్పటి డిప్యూటీ సీఎం శిల్పికి రూ.10 లక్షలు బయానాగా ఇచ్చారు. వర్సిటీ ముఖద్వారం వద్ద విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. ఇది కార్యరూపంలోకి తేకుండా అక్కడ ఒక రైతు, అతని భార్య బొమ్మలను ఏర్పాటుచేశారు. దీంతో వర్సిటీలో వైఎస్‌ ముద్రను చెరిపే కుట్ర మరోసారి తేటతెల్లమైంది. ఈ విషయంపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. విషయాన్ని పరిశీలించాల్సిన కోర్టు దీనికి సంబంధించిన వివరాలు అందచేయాల్సిందిగా ఉద్యాన వర్సిటీ అధికారులను ఆదేశించింది. రైతు ఉద్యాన పంటలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. దక్షిణ భారత దేశంలో మొదటిది.. దేశంలో రెండవదిగా ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతం వర్సిటీ ఏర్పాటుకు ఎందుకు అనుకూలమో కొట్టు సత్యనారాయణ అంకెలతో అసెంబ్లీలో విపులీకరించారు. గూడెంలో వర్సిటీని అడ్డుకొనే ప్రయత్నం చేసిన కొంతమంది నోటికి తాళం వేశారు. గూడెంలో రాజీవ్‌ గృహకల్ప సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అదే వేదికపై నుంచి గూడెంలో ఉద్యాన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అనంతరం 2007లో వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. 2014లో టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2015లో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును మార్చాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది.

తాజాగా రెండో కుట్ర : వైఎస్‌ విగ్రహాన్ని ఆయన స్మృతిచిహ్నంగా ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేయడానికి ప్లాట్‌ఫాం కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిల్పికి తయారీ బాధ్యత అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ విగ్రహం ఏర్పాటుచేయాల్సిన ప్రాంతంలో రైతు దంపతుల బొమ్మను ఏర్పాటుచేసింది. దీంతో కొట్టు సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

ఉద్యాన వర్సిటీ ముఖ ద్వారం వద్ద వైఎస్‌ విగ్రహం ఏర్పాటుకు అడ్డుపుల్ల

కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కొట్టు

మాట తప్పారు

వైఎస్‌ కృషితో ఇక్కడ ఉద్యాన వర్సిటీ వచ్చింది. ఆయన సేవలకు గుర్తింపుగా వర్సిటీ ముఖద్వారం వద్ద యోగ ముద్రలో వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని 2023లో నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు విగ్రహం తయారీకి బయానా ఇచ్చాం. నిర్ణయించిన ప్రాంతంలో విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. అది కాదని రైతు దంపతుల బొమ్మను పెట్టారు. దీనిపై న్యాయస్ధానాన్ని ఆశ్రయించా. విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

– కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం

కోర్టు ఆదేశాలు అందలేదు

వైఎస్‌ విగ్రహం ఏర్పాటులో హైకోర్టు ఆదేశాలు ఇంకా మాకు అందలేదు. అందిన తర్వాత గత విషయాలు పరిశీలించి ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారు.

– బి.శ్రీనివాసులు. రిజిస్ట్రార్‌, ఉద్యాన వర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement