మండవల్లి: గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ వి.రవికుమార్ చెప్పారు. మండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలను వెల్లడించారు. కైకలూరు వెలమపేటకు చెందిన షేక్ ఫరీద్ అబ్బాస్, ముదినేపల్లి మండలం చైతన్యపురంనకు చెందిన ఎలికే రాజేష్ కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి క్రయ, విక్రయాలకు పాల్పడుతున్నారు. బుధవారం చావలిపాడు వద్ద వీరిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 755 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం ననుసరించి కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో రూరల్ ఎస్సై సీహెచ్‌ఎస్ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణకు సేవా పతకం
దెందులూరు: దెందులూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్‌వీఆర్ సత్యనారాయణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ సేవా పతకం ప్రకటించింది. సత్యనారాయణ పోలీస్ శాఖలో 1993లో కానిస్టేబుల్‌గా చేరారు. ఆయనకు పోలీస్ సేవా పథకం రావడంపై ఎస్సై ఆర్.శివాజీ, హెడ్ కానిస్టేబుల్, ఇతర కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేశారు
గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్