
ఎకై ్సజ్ స్టేషన్‌పై దాడి
చింతలపూడి: చింతలపూడి ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌పై నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు బుధవారం దాడి చేశారు. గ్రామంలో సారా తయారు చేస్తున్న వడిత్యా రామదాసు అనే వ్యక్తిని ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నారన్న అనుమానంతో బంధువులు, కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎకై ్సజ్ సిబ్బంది చెప్పారు. దాడిలో కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయన్నారు. ఆ సమయంలో అధికారులు ఎవరూ కార్యాలయంలో లేరు. జరిగిన ఘటనపై అధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సిబ్బంది చెప్పారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కాళ్ల: కూలి పనికి వెళ్లి విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎన్. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ళకూరు గ్రామానికి చెందిన ఉబ్బా వెంకన్న(36) బుధవారం కూలి పని నిమిత్తం దొడ్డనపూడి గ్రామం వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా వర్షపు చినుకుల వల్ల కరెంటు షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడ్ని వైద్యం నిమిత్తం కాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మృతుని అన్నయ్య రాంబాబు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అథ్లెటిక్స్‌లో పతకాలు
ఏలూరు రూరల్: ఈ నెల 9 నుంచి 11 వరకూ చీరాలలో జరిగిన 36వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ఏలూరు జిల్లా బాలికలకు డీఎస్‌డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకనటలో అభినందనలు తెలిపారు. డీఎస్‌ఏ కోచ్ గంటా కృష్ణకుమారి వద్ద శిక్షణ పొందుతున్న వి రంజని 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్, 200 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్ సాధించిందని వివరించారు. మిడిల్ రిలే విభాగంలో జె పల్లవితో పాటు రంజని సైతం బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. అండర్–20 విభాగంలో బి నీలిమ 400 మీటర్ల పరుగులో బ్రాంజ్ మెడల్, ఎం దొరబాబు పెంఠధలోన్‌లో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారని వివరించారు.

ఎకై ్సజ్ స్టేషన్‌పై దాడి