
అధినేతకు నీరాజనం
భీమవరంలో హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, పార్టీ భీమవరం, ఉండి సమన్వయకర్తలు చినమిల్లి వెంకటరాయుడు, పీవీఎల్ నరసింహరాజు
జోరువానలోనూ అదే అభిమానం
● భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
● వర్షాన్ని సైతం లెక్కచేయకుండాపోటెత్తిన అభిమానులు
● తరలివచ్చిన ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి నాయకులు
● హెలీప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకూ భారీ జనసందోహం
భీమవరం/భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అ భిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ విచ్చేశారు. భీమవరంలో హెలీప్యాడ్‌కు చేరుకున్న జగన్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ భీమవరంలోని వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో జరుగుతున్న వివాహ వేడుక వద్దకు వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట అభిమానులు బైక్ ర్యాలీ గా తరలివెళ్లారు. జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా..
వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి రాక ముందే భీమవరంలో వర్షం ప్రారంభమైంది. అప్పటికే జగన్‌ను చూసేందుకు భీమవరంలో హెలీప్యాడ్, కల్యాణ మండపానికి వెళ్లే దారిలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. భీమవరంలో జగన్ హెలీకాప్టర్ దిగే సమయంలోనూ భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు అలా గే వేచి ఉన్నారు. ఆయన వెంట ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కల్యాణ మండపం వరకూ తరలి వెళ్లారు. వర్షంలోనూ అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకుసాగారు.
కల్యాణ మండపం వద్ద..
వీవీఆర్ గార్డెన్స్‌లో వేదికపైకి వచ్చిన జగన్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. సోపాలు, కుర్చీలు ఎక్కి మరీ ఆయన్ను చూడటంతో పాటు తమ అభిమాన నేతను సెల్‌ఫోన్లలో బంధించారు.
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రముఖులు : వైఎస్ జగన్‌కు హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలి కారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్ చార్జ్ గూడూరి ఉమాబాల, మాజీ మంత్రులు చెరు కువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, భీమవరం, ఉండి, చింతలపూడి, కైకలూరు, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు, కొవ్వూరు, రామచంద్రాపురం, అమలాపురం ఇన్‌చార్జ్‌లు చినమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు, కంభంపాటి విజయరాజు, దూలం నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, తలారి వెంకట్రావు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్ కుమార్, పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవు డు వెంకటరమణ, సంచార జాతుల విభాగం అధ్యక్షుడు పెండ్ర వీరన్న, పార్టీ నేతలు పేరిచర్ల విజయ నరసింహరాజు, మేడిది జాన్సన్, వేండ్ర వెంకటస్వామి, పాతపాటి శ్రీనివాసరాజు, కోడి విజయలక్ష్మి యుగంధర్, ఏఎస్ రా జు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

అధినేతకు నీరాజనం

అధినేతకు నీరాజనం

అధినేతకు నీరాజనం