రోజురోజుకూ ధర తగ్గుతూ..
ఈ ఏడాది మామిడి దిగుబడి బాగా తగ్గినా ధర పెరగకుండా తగ్గుతోంది. రోజురోజు కూ ధర తగ్గిపోతుండటంతో పెట్టుబడులు కూడా వస్తాయోరావోనని ఆందోళన పెరుగుతోంది. రసాయన మందుల పిచికారీ, తోట కాపలా, ఇతర ఖర్చులు కలిపి పెట్టుబడులు తడిసి మోపెడవుతుండగా మామిడికి మాత్రం ధర పెరగడం లేదు.
– యర్రంశెట్టి రవితేజ, నూజివీడు
నిరాశాజనకంగా ధరలు
ఈ ఏడాది కాపు తక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుందని అనుకున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితిని చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సేట్‌లందరూ సిండికేట్ అయ్యి ధరను తగ్గించేస్తున్నారు తప్పితే పెంచడం లేదు. దీంతో పెట్టుబడులు ఏ మాత్రం రావు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి.
– బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు మండలం
●
రోజురోజుకూ ధర తగ్గుతూ..


