భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపల్ రెవెన్యూ కార్యాలయంలో పాత ఫర్నిచర్, పనిచేయని కంప్యూటర్లతో ఆర్‌ఐలు ఇబ్బందులు పడుతు న్నారని ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి స్పందించారు. రెవెన్యూ విభాగానికి మూడు కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేశారు. తమ ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన ‘సాక్షి’కి రెవెన్యూ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేడ్–1 మున్సిపాలిటీ, ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్నా భీమవరంలో సౌకర్యాల కొరత వేధిస్తోంది.
టెన్త్ పరీక్షలకు 99 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన ప్రథమ భాష పేపర్–2, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1కు 99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 4,163 మంది విద్యార్థులకు 4,132 మంది హాజరయ్యారన్నారు. 39 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదని నారాయణ తెలిపారు.
మద్యం షాపు ఏర్పాటుపై మండిపాటు
నరసాపురం: నరసాపురంలోని 26వ వార్డు వీవర్స్ కాలనీలో మద్యం షాపు ఏర్పాటును శనివారం స్థానికులు అడ్డుకున్నారు. కల్లుగీత కార్మికుల కోటాలో షాపును వీవర్స్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసే యత్నం చేశారు. షాపును ప్రారంభానికి సిద్ధం చేస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో ఇళ్ల మధ్య బ్రాందీ షాపు పెడితే ఎలాగని ప్రశ్నంచారు. కాలనీలో రోడ్డుపై మహిళలు తిరగలేరని, చిన్న పిల్లలు ఆడుకునే గ్రౌండ్ వద్ద షాపు ఎలా పెడతారని నిలదీశారు. మహిళల ఆందోళనతో నిర్వాహకులు షాపు ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెళ్లిపోయారు.
బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం
భీమవరం: రాష్ట్రంలో బెల్టుషాపులను అరికట్ట లేని కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి దుయ్యబట్టారు. శనివారం భీమ వరం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 70 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయని, గోవా, యానాం నుంచి అక్రమ మద్యం వస్తుండటంతో తాటి కల్లు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గీత కార్మికుల పరిస్థితి మ రింత అధ్వానంగా మారిందన్నారు. కల్లు గీత వృత్తిలో మార్పు తెచ్చి గీత కుటుంబాలకు ఉ పాధి కల్పించి ఆదుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతోనే బెల్ట్ షాపులు నిర్వహించ డం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ బెల్ట్ షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎక్సైజ్‌శాఖ గీత కార్మికుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ
ఉంగుటూరు: కాగుపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రెండోసారి శనివారం విచారణ జరిగింది. నూజివీడు డీఎల్‌పీఓ కార్యాలయంలో డీఎల్‌పీఓ విచారణ చేయగా ఆరోపణలకు బాధ్యులు సర్పంచ్ కడియాల సుదీష్ణ, కార్యదర్శి, దుర్గాధర్, పూర్వ కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీదేవి, ఆరోపణలు చేసిన వార్డు సభ్యులు హాజరయ్యారు. కార్యదర్శి బాలకృష్ణ రూ.1.42 లక్షలు, కార్యదర్శి శ్రీదేవి రూ.6.35 లక్షలు, సర్పంచి సుదీష్ణ రూ.7.77 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్టు నోటీసులో తెలిపారు.
మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు