భీమడోలు: నైపుణ్యాలు గల యువతకు ఉద్యో గ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి రవి శ్యామ్ అన్నారు. భీమడోలు వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కల్పనా శాఖల సంయుక్త ఆ ధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 10వ తరగతి ఆపై చదివిని పలువురు నిరుద్యోగులు హాజరయ్యారు. డైకిన్, ముత్తూట్ ఫైనాన్స్, అరిజియో ఫైనాన్స్ కంపెనీల్లో 25 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కళాశాల ప్రి న్సిపల్ బొమ్ము రవికుమార్, నైపుణ్యాభివృద్ది సంస్థ ప్రతినిధులు జే.రాము. ప్రవీణ్, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇంగ్లిష్ పరీక్షకు 98 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 21,867 మంది విద్యార్థులకు 398 మంది గైర్హాజరయ్యారన్నారు. ఏపీఓఎస్‌ఎస్ తెలుగు పరీక్షకు 461 మందికి 368 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 42 పరీక్షా కేంద్రాలు, జిల్లాస్థాయి పరిశీలకులు నాలుగు, డీఈఓ ఆరు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 10 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ వివరించారు.
ఏలూరు జిల్లాలో..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 22356 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22,735 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,288 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 133 మందికి 68 మంది హాజరయ్యారు. జిల్లాలోని 64 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
దూరవిద్య పరీక్షలకు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న టెన్త్ తెలుగు పరీక్షకు 460 మంది విద్యార్థులకు 402 మంది హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు ఆరుగురికి ఆరుగురు హాజరయ్యారు. తొమ్మిది కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.
పంచాయతీ సెక్రటరీ అరెస్ట్
భీమవరం: భీమవరం మండలం చినఅమిరంలో నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన సాగిరాజు కిషోర్‌గోపాల్ కృష్ణంరాజును శుక్రవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఆర్‌జే జయసూర్య తెలిపారు. చినఅమిరం పంచాయతీలో సుమారు రూ.3.63 కోట్లు నిధులు దుర్వినియోగం కాగా అధికారుల ఫిర్యాదు మేరకు కృష్ణంరాజును అరెస్ట్ చేశామన్నారు. అతడిని భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు.
సొసైటీలో నిధుల గోల్‌మాల్‌పై విచారణ
పెనుగొండ: మండలంలోని ములపర్రు ప్రాథమిక సహకార సంఘంలో 2018లో రూ.90 లక్షలు గోల్‌మాల్ కాగా దీనిపై శుక్రవారం విచారణ చేపట్టారు. అప్పటి పాలకవర్గ సభ్యులను అప్పట్లో ప్రజలు, డిపాజిటర్లు, పాలకవర్గ సభ్యులు నిలదీయడంతో రూ.50 లక్షలు చెల్లించారు. మిగతా రూ.40 లక్షలు అప్పటినుంచి రికవరీ కాలేదు. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంఎం రెహమాన్ ములపర్రు సొసైటీలో విచారణ చేపట్టారు. విచారణలో వచ్చిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు.
ఎండలతో జాగ్రత్త
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ముందస్తు చర్యలను చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పాటుచేయాలని సూచించారు. బస్టాప్, పబ్లిక్ ప్రాంతాల్లో నీడ కల్పించేలా పందిర్లు వేయాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని అప్రమత్తంగా ఉండాలన్నారు. గొడు గులు, తలకు టోపీ వంటివి వాడాలన్నారు. కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నైపుణ్యంతో అపార అవకాశాలు