భీమవరం: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్, తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాతల జేమ్స్, సాగిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ తక్షణం ఏర్పాటుచేసి ఐఆర్ ప్రకటించాలని, డీఆర్, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ కార్డులపై వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోశాధికారి బీవీ రవిప్రసాద్, భీమవరం యూనిట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ఎస్‌ఎస్ పాల్, పి.సీతారామరాజు పాల్గొన్నారు.
అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి
భీమవరం: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్‌ఎస్) వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కా ర్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. మొత్తం 11 అర్జీలు రాగా ఆయా సమస్యల పరిష్కారానికి ఫోన్‌లో అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏఎస్పీ వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, జిల్లా మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ ఉన్నీషా పాల్గొన్నారు.
చేనేత కార్మికుల నిరసన
భీమవరం: చేనేత కార్మికులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చేతివృత్తుల సంఘం జిల్లా నాయకుడు ఎం.సీతారాంప్రసాద్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటా యిస్తే కూటమి ప్రభుత్వం రూ.135 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగింపు హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.
వాట్సాప్ ద్వారా పౌర సేవలు
భీమవరం (ప్రకాశంచౌక్): మనమిత్ర వాట్సాప్ పౌర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మనమిత్ర–ప్రజల చేతిలో ప్రభుత్వం సమాచారం వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. అలాగే జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు.
ఇన్‌చార్జి దేవదాయ శాఖ అధికారిగా సూర్యప్రకాష్
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా ఇన్‌చార్జ్ దేవదాయశాఖ అధికారిగా వి.హరి సూర్య ప్రకాష్ సోమవారం భీమవరం జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీక రించారు. నిడదవోలు కోటసత్తెమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న ఆయన్ను ఇన్‌చార్జి జిల్లా దేవదాయశాఖ అధికారిగా నియమించారు.
డీఎంహెచ్‌ఓగా గీతాబాయి
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్ జి.గీతాబాయిను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పనిచేసిన మహేశ్వరరావు రెండు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో సీ ఎంఓహెచ్‌గా పనిచేస్తున్న గీతాబాయిని డీఎంహెచ్‌ఓగా నియమించారు.
తెలుగును ఐచ్ఛికం చేయొద్దు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణల్లో భాగంగా ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకుల సంఘం నాయకులు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె. యోహానుకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రారంభమైన ఇంటర్ మూల్యాంకనం సందర్భంగా వినతిపత్రా న్ని సమర్పించారు. తెలుగును ఐచ్ఛికం చే యడం వల్ల భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీ రాజేష్ కుమార్, టి.ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి