అన్నదానం జమాఖర్చుల్లో మతలబు
తేడాలెన్నో..
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాస నిత్యాన్నదాన కార్యక్రమంలో లాభనష్టాల లీలలేమిటో ఆ పరమశివుడికే ఎరుక. ఈ ఏడాది దేవస్థానం పాలక మండలి, అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. దాతలు, భక్తుల నుంచి విరాళాలు సేకరించారు. అయితే ఈ ఏడాది ప్రకటించిన జమాఖర్చుల లెక్కల్లో సుమారు రూ.లక్ష వరకు నష్టం చూపడం పాత కమిటీ సభ్యులతో పాటు పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే దేవస్థానం అధికారులు పెట్టిన జమాఖర్చుల పట్టికలు (పాత, కొత్త) చూస్తే అనుమానాలు కలుగుతున్నా యి. దేవస్థానం ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.29.36 లక్షల ఆదాయం రాగా ఖర్చులు రూ. 30.36 లక్షలుగా చూపారు. దాతల సహకారంతో అన్నదానం నిర్వహించినప్పుడు కేటరింగ్ వారికి రూ.40 చొప్పున చెల్లిస్తున్నారు. కార్తీకమాసంలో సుమారు 60 వేల మందికి అన్నదానం నిర్వహించినా రూ.24 లక్షలు అవుతుందని, అయితే రూ.30 లక్షలకు పైగా ఖర్చు ఎలా చూపారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ఓ తెలుగు తమ్ముడు తనకున్న పలుకుబడితో దాదాపు 10 నుంచి 15 రోజులపాటు అన్నసమారాధనకు దాతలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో ముందుగా ఓ జమాఖర్చుల పట్టికను చూపారు. ఇదిలా ఉండగా ఆలయ అధికారి, పాలకమండలి సభ్యులు, మరో వ్యక్తి కలిసి తాము చెప్పిందే శాస నం అన్నట్టు వ్యవహరించడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో దాతల వివరాలు, ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలతో జమాఖర్చులు చెప్పాలనే డిమాండ్ రావడంతో కొత్త పట్టికను ఏర్పాటుచేశారు. అయితే పలు ఖర్చులకు సంబంధించి పాత, కొత్త పట్టికలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత, కొత్త పట్టికలపై చర్చ జరగకుండానే చేతికి జమాఖర్చులు పట్టిక ఇచ్చినట్లు పాలకమండలి సభ్యులు చెప్పడం గమనార్హం.
జమాఖర్చుల పట్టిక (కొత్త)
కార్తీకమాసం పూర్తయిన వెంటనే అన్నదానానికి సంబంధించి జమాఖర్చుల బోర్డు ఏర్పాటుచేసి రూ.లక్ష నష్టం వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో వెంటనే డిలీట్ చేశారు. ఈ మధ్య కొత్త పట్టిక ఏర్పాటుచేశారు. చిత్రం ఏమిటంటే దాదాపు నగదులో తేడా లేకపోయినా వినియోగించిన సరుకులను స ర్దుబాటు చేసి మొత్తాన్ని సరిపెట్టేశారు. పాత పట్టిక లో రూ.5 వేల ధరపై 94 క్వింటాళ్ల బియ్యాన్ని రూ.4.70 లక్షలకు కొనుగోలు చేసినట్టు చూపగా కొత్త పట్టికలో కిలోల్లో 9,776 కిలోల అని చూపి, క్వింటాళ్లలో మాత్రం 47 అని కిలో ధర రూ.48గా చూపారు. క్వింటాళ్లను పరిగణనలోకి తీసుకుంటే రూ.2.44 లక్షలు తేడా కనిపిస్తుంది. వాటర్ ప్యా కెట్లు, టిప్‌టాప్ సప్లయీర్స్, లేబర్ ఖర్చులు, సప్లయీర్ ఖర్చు ఇలా పలు వివరాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే పాత పట్టికలో రూ.34,500 విలువైన కూరగాయలను సిద్దాంతం నుంచి హోల్‌సేల్‌లో కొనుగోలు చేసినట్టు చూపా రు. అయితే సుమారు రూ.10 లక్షల విలువ చేసే కిరాణా సరుకులు మాత్రం ఓ రిటైల్ షాపులో కొ నుగోలు చేశామనడం విమర్శలకు తావిస్తోంది.
క్షీరారామం నిత్యాన్నదాన కమిటీపై విమర్శలు
జమాఖర్చుల్లో నష్టం చూపడంపై అనుమానాలు
పాత, కొత్త పట్టికలో స్పష్టంగా తేడాలు
అన్నదానం జమాఖర్చుల్లో మతలబు


