సబ్ జైలు సందర్శన
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని ప్రత్యే క ఉప కారాగారాన్ని శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎస్.శ్రీదేవి సందర్శించి ముద్దాయిలతో మాట్లాడారు. భోజన వసతులు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. న్యాయవాదిని పెట్టుకునే స్థోమతలేని వారికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా బ్యారక్, ములాఖత్ గదిని పరిశీలించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కె.రత్నప్రసాద్, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, జైలు సూపరింటెండెంట్ డి.వెంకటగిరి, జైలు సందర్శన న్యాయవాది బి.లోకేశ్వరరావు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో 83.690 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.41.33 కోట్లు మంజూరు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలపిఆరు. రెండు రాష్ట్ర రహదారులకు 12.580 కిలోమీటర్ల పరిధిలో రూ.9 కోట్లు, 16 ప్రధాన రహదారులు 71.110 కిలోమీటర్ల పరిధిలో రూ.32.33 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు.
31న పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒక రోజు ముందుగానే ఈనెల 31న పంపిణీ చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు.
పెనుమంట్ర: ఇటీవల విజయవాడలో నిర్వ హించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పె నుమంట్ర జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. వీరి ప్రాజెక్టు ‘పరాయి వలయంలో అద్భుతాలు’ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు హెచ్‌ఎం లింగం శారద శనివారం ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాల 9వ తరగతి విద్యార్థులు పెచ్చిటి పావని కళ్యాణి, పుచ్చ శ్రీవిద్య తయారుచేసిన ప్రాజెక్టు జిల్లా నుంచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. వి ద్యార్థులతో పాటు ఈ ప్రాజెక్టు తయారీకి గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయులు ఎమ్మెస్ శివకుమార్, ఎ.వీరభద్రంను అభినందించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన ప్రముఖ కూచిపూడి నా ట్య గురువు, కళారత్న కేవీ సత్యనారాయణకు ఆంధ్ర సారస్వత పరిషత్తు పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 3 నుంచి గుంటూరులో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమాల్లో కేవీఎస్‌కు పురస్కారం ప్రదానం చేయనున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.
ఏలూరు (టూటౌన్): బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపాలని, గిరిజన భూసమస్యలు పరిష్కరించి న్యాయం చే యాలని ఆదివాసీ గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇనుమూరు గిరిజనులకు అండగా ఈనెల 29న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం, 30న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. శనివారం ఏ లూరు అన్నే భవనంలో ఏపీ రైతు సంఘం జి ల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు డు రాజనాల రామ్మోహనరావు, సీపీఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి శావనంపూడి నాగరాజు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు కట్టా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు కారం భాస్కర్, ఇనుమూరు గిరిజన భూ బాధితులు పాల్గొన్నారు.
సబ్ జైలు సందర్శన


