పట్టిసం ఉత్సవాలపై సమావేశం
పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై తొలి సమావేశం జరిగింది. ఫిబ్రవరి 15న ఉత్సవాలు నిర్వహించనున్నారు. 8లో u
యనమదుర్రు డ్రెయిన్‌పై భీమవరం రెస్ట్‌హౌస్ రోడ్డు, భీమవరం రూరల్ గొల్లవానితిప్ప, దొంగపిండి వద్ద వంతెనలకు వద్ద అప్రోచ్ రోడ్డులు నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.36.71 కోట్లు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులను అటకెక్కించడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చినమిల్లిపాడు–ఆకివీడు మెయిన్‌రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 25 కోట్లు, భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ వెళ్లే రోడ్డులోని బొండాడ డ్రెయిన్‌పై వంతెనకు రూ.12 కోట్లు, ఆచంట నియోజకవర్గం నెగ్గిపూడి, తాడేపల్లిగూడెంలో ఆర్‌అండ్‌బీ ఇన్‌స్పెక్షన్ బంగ్లాల మరమ్మతులకు కేటాయించిన రూ.1.57 కోట్ల పనులను రద్దు చేసింది.


