ప్రగతి అధోగతి | - | Sakshi
Sakshi News home page

ప్రగతి అధోగతి

Dec 28 2025 12:51 PM | Updated on Dec 28 2025 12:51 PM

ప్రగత

ప్రగతి అధోగతి

ప్రభుత్వ స్థలాలపై కన్ను

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ స్థలాలపై కన్ను
పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. చేపల చెరువుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారు. 8లో u
సంక్షేమాన్ని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధినీ గాలికొదిలేసింది. జిల్లాకు తలమానికంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఆక్వా వర్సిటీకి ఏడాది కాలంలో ఒక్క ఇటుకై నా పేర్చలేదు. ప్రైవేటీకరణ పేరిట మెడికల్‌ కళాశాల పనులు అర్ధాంతరంగా ఆపేసింది. టెండర్ల దశలోని రూ.75 కోట్ల విలువైన పనులను రద్దు చేసింది. కొద్దిపాటి పనులు చేస్తే వినియోగంలోకి వచ్చే పలుసచివాలయ, ఆర్‌బీకే, హెల్త్‌ క్లినిక్‌ భవనాలను అసంపూర్తిగా వదిలేసింది.

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం : సుపరిపాలన, ప్రజారోగ్యం, రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో రూ.141.2 కోట్లతో 353 సచివాలయ, రూ.65 కోట్లతో 298 ఆర్‌బీకే, రూ.53.5 కోట్లుతో 214 హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం చేపట్టారు. అప్పట్లోనే 270 వరకు సచివాలయ, 211 ఆర్‌బీకే, 96 హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిద దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చేందుకు చొర వ చూపని చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ, ఆర్‌ బీకే భవనాల్లో పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌, డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ తదితర కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

ఆక్వా వర్సిటీకి ‘చంద్ర’ గ్రహణం

ఆక్వా రంగానికి ఊతంగా నరసాపురం రూరల్‌ లిఖితపూడిలోని 40 ఎకరాల స్థలంలో చేపట్టిన ఆక్వా వర్సిటీ పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, క్యాంపస్‌ కాలేజీ, బా య్స్‌, గరల్స్‌ హాస్టల్‌ భవన ని ర్మాణాల కోసం గత ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రూ.40 కోట్ల వ్యయంతో అడ్మినిస్ట్రేటివ్‌, కళాశాల భవనాలు శ్లాబ్‌ దశకు, బాయ్స్‌, గరల్స్‌ హాస్టల్‌ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయక పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. యూనివర్సిటీకి అనుబంధంగా కళాశాల తరగతులను గత నెల వరకు లక్ష్మణేశ్వరంలోని తుపాను షెల్టర్‌, రైతు భరోసా కేంద్రాల్లో నిర్వహించగా ఇటీవల నరసాపురంలోని ప్రైవేట్‌ కళాశాల భవనంలోకి మార్చారు.

మెడి‘కిల్‌’ కళాశాల నిర్మాణం

పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.475 కోట్లతో పాలకొల్లు రూరల్‌ దగ్గులూరులోని 60 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన మెడికల్‌ కళాశాల పనులకు ప్రైవేటీకరణ గ్రహణం పట్టింది. గత ప్రభుత్వంలోనే ఇన్‌ పేషెంట్‌, అవుట్‌ పేషెంట్‌, ఎమర్జన్సీ సేవల బ్లాకులకు సంబంధించి సుమారు రూ.74.5 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం బిల్లులు విడుదల చేయక నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. మెడికల్‌ కళాశాలను ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.

రోడ్డు ‘షో’

రోడ్ల అభివృద్ధి పేరిట మరమత్ములతో కనికట్టు చేస్తూ ప్రభుత్వం ఏడాది గడిపేసింది. గతేడాది సంక్రాంతికి ముందు రూ.42.57 కోట్లతో చేపట్టిన ప్యాచ్‌ వర్కులు నాణ్యత లేక మున్నాళ్ల ముచ్చటే అయ్యాయి. కొద్దిరోజులకే రాళ్లుపైకి లేయిపోయి ప్రమాదభరితంగా తయారై రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడ్డారు. రానున్న సంక్రాంతి పండగ చుట్టాల ముందు మరోమారు రోడ్డు షో చేసే పనిలో ప్రభుత్వం ఉంది. నాబార్డ్‌, ప్లాన్‌, ఎస్‌సీసీ వర్క్స్‌, అడిషనల్‌ ఫండ్స్‌ రూ.141 కోట్లతో జిల్లాలో పలు రోడ్లలో 37 వర్క్‌లు మంజూరు చేసింది. వీటిలో రూ.53 కోట్ల విలువైన 16 వర్కులు మాత్రమే మొదలయ్యాయి. మిగిలిన వాటికి టెండర్లు జరగాల్సి ఉంది. యాన్యువల్‌ మెయింటినెన్స్‌ నిధులు రూ.3 కోట్లతో 650 కిలోమీటర్లు మేర చేపట్టిన ప్యాచ్‌ వర్కుల్లో పలుచోట్ల నాణ్యత లోపిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

పాలకొల్లులో అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్‌ కళాశాల నిర్మాణం

తణుకులో ప్యాచ్‌ వర్క్‌లు

నిర్మాణం.. నిర్లక్ష్యం

కూటమి నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి

ఆక్వా వర్సిటీకి ఇటుకై నా పేర్చలేదు

ప్రైవేటీకరణ గ్రహణంతో నిలిచిన వైద్య కళాశాల పనులు

అసంపూర్తిగానే సచివాలయ, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు

రూ.75 కోట్ల విలువైన పనులు రద్దు

2025లో అభివృద్ధిలో వెనుకబాటు

ప్రగతి అధోగతి 1
1/4

ప్రగతి అధోగతి

ప్రగతి అధోగతి 2
2/4

ప్రగతి అధోగతి

ప్రగతి అధోగతి 3
3/4

ప్రగతి అధోగతి

ప్రగతి అధోగతి 4
4/4

ప్రగతి అధోగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement