
రేపటి నుంచి ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర
భీమవరం: స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నుంచి ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంటు నిర్వహిస్తున్నట్లు క్లబ్ ఉపాధ్యక్షుడు ఎం.సుబ్బరాజు, టోర్నమెంట్ డైరెక్టర్ యూఆర్‌పీఆర్ వర్మ చెప్పారు. క్లబ్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 15, 16 తేదీల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. 17 నుంచి 21 వరకు ప్రధాన పోటీలు నిర్వహిస్తామన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ కల్చరల్ అసోసియేషన్, ఎల్‌హెచ్ భీమవరం టౌన్‌హాల్, డీఎన్నార్ కళాశాల, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణల్లోని టెన్నిస్ కోర్టుల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 220 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని . విజేతలకు రూ. 4 లక్షలు విలువైన బహుమతులు అందిస్తామన్నారు. 35, 45, 55, 65, 70,75 ఏళ్ల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహించే పోటీలకు వెర్‌టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ వి.వెంకట రాయవర్మ ప్రధాన సహకారం అందిస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ టీపీఏ కార్యదర్శి ఎ.రాంబాబు, కేఆర్‌కే రాజు, క్లబ్ సెక్రటరీలు పీవీ రామరాజు, వీవీఎస్‌ఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.